ఏపీకి అదిరిపోయే న్యూస్- 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ సంతకం..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి.
ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోనే అతిపెద్ద సంస్ధ రిలయన్స్ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో సంస్ధ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దీంతో త్వరలోనే ఈ పెట్టుబడులు అమల్లోకి రానున్నాయి.

ఏపీలో 65 వేల కోట్ల పెట్టుబడితో 500 అత్యాధునిక బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకొచ్చింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఏపీలో 2.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. 8 జిల్లాల్లో 500 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. రెండేళ్లలో బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

reliance energy signs mou

ప్రభుత్వం తరపున రిలయన్స్ ఎనర్జీకి అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజన్నారు. రైతులకు రూ.30 వేలు చొప్పున ఇచ్చేలా పాలసీ ఉంటుందని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల ఉద్యోగాలు దీని వల్ల లభిస్తాయన్నారు. ఏపి ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే రిల‌య‌న్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని కోరారు. 25 సంవ‌త్సరాల్లో 57వేల 650 కోట్ల బెనిఫిట్ వ‌స్తుందని చంద్రబాబు తెలిపారు. 500ప్లాంట్ లు పూర్తిచేస్తే రిన్యూవ‌బుల్ ప్యూయ‌ల్ 9 ల‌క్ష‌ల 35వేల ఎల్ సి బిల‌కు రిప్లేస్ మెంట్ వ‌స్తుందని వెల్లడించారు.

reliance energy signs mou

ఈ సందర్బంగా మంత్రులు లోకేష్‌, గొట్టిపాటి ర‌వి, టిజి భ‌ర‌త్ ల‌ను సిఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా అభినందించారు. అతి స్వ‌ల్ప‌కాలంలో ఈ ఎంవోయూ కోసం లోకేష్ బాగా ప‌నిచేశారన్నారు. లోకేష్ కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చామని, ఆ దిశ‌గా ఆయ‌న ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. మంత్రి గోట్టిపాటి ర‌వి కూడా ఒప్పందం కార్య‌రూపం దాల్చ‌డానికి బాగా స‌హ‌క‌రించారన్నారు. మంత్రి టిజి భ‌ర‌త్ ఉన్న‌త విద్యావంతుడు, చాలా మంచి వ‌ర్కు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+