AP Global Investors Summit : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం- తొలిరోజే అంబానీ ఎంట్రీ..
ఏపీలో దేశ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. 25 దేశాల నుంచి తరలివచ్చిన 46 మంది దౌత్యవేత్తలు, 14 వేల మంది ప్రతినిధులకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ఆహ్వానం పలుకుతున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలిరోజే రిలయన్స్ గ్రూపు అధినేత ముకేష్ అంబానీ తరలివచ్చారు. అంబానీ రాకతో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు కళ వచ్చినట్లయింది. సీఎం వైఎస్ జగన్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు.

ముకేష్ అంబానీ కూడా ఆయన్ను రాగానే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సదస్సు వేదిక వద్దకు కలిసి వెళ్లారు. ముకేష్ అంబానీతో పాటు పలువురు వ్యాపార దిగ్గజాలు కూడా ఈ సదస్సుకు తొలిరోజే హాజరయ్యారు.

ఏపీలో రిలయన్స్ సంస్ధ గతంలోనే పలు పెట్టుబడులు పెట్టింది. విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. ఈసారి కూడా రిలయన్స్ పలు పెట్టుబడులతో ఏపీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం- తొలిరోజే అంబానీ ఎంట్రీ..!!#MukeshAmbani #Ambani #GlobalInvestorsSummit2023 #GlobalInvestorsSummit #Vishakapatnam #APGIS2023 #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/nf4uFc5ps5
— oneindiatelugu (@oneindiatelugu) March 3, 2023
రిలయన్స్ గ్రూప్ కు చెందిన పరిమళ్ నత్వానీని సీఎం జగన్ ఇప్పటికే రాజ్యసభకు తమ పార్టీ తరఫున ఎంపీగా పంపారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ గ్రూపుతో ఉన్న బంధాన్ని పెట్టుబడులకు వాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.













Click it and Unblock the Notifications