టీటీడీకి రిలయన్స్ భారీ విరాళం: రూ. 1,11,11,111
తిరుమల: శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకి ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ విరాళం అందజేసింది. మొత్తం రూ. 1,11,11,111ల విరాళాన్ని సమర్పించింది.

ఈ మేరకు ఆ మొత్తానికి సంబంధించిన డీడీని తిరుమలలోని దాతల విభాగంలో కంపెనీ ప్రతినిధి శివశంకర్ సోమవారం సమర్పించారు. గతంలోనూ పలు సందర్భాల్లో టీటీడీ చేపడుతున్న పలు ధార్మిక, సేవా కార్యక్రమాలకు రిలయన్స్ సంస్థ విరాళాలను అందజేసింది.
ధాతృత్వ, సేవా కార్యక్రమాల్లో ముందుండే రిలయన్స్ సంస్థ.. కేరళ వరద బాధితుల కోసం రూ.21కోట్ల విరాళాన్ని అందజేసింది. దీనికి అదనంగా రూ. 50కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, గృహోపకరణాలు, ఇతర వస్తువుల రూపంలో అందజేసింది.












Click it and Unblock the Notifications