ఓటుకు నోటు కేసు: హై కోర్టులో చంద్రబాబుకు ఊరట

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారించింది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారించింది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు.

Relief for Chandrababu in High court

దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదన్న ఆయన తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. ఆళ్ల రామకృష్ణ, ఉండవల్లి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారించాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.

అంతకుముందు జరిగిన పరిణామాలు గమనించినట్గయితే, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు స్టే తెచ్చుకోగా, సుప్రీంకోర్టు కల్పించుకున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లోగా వాదనలు విని చంద్రబాబుపై విచారణ విషయమై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత నెలలో వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు.. నేడు తీర్పును వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+