ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్
అనంతపురం సహా రాయలసీమ ప్రాంతంలోని లక్షలాది మంది పేద, అణగారిన ప్రజల జీవితాల్లో దశాబ్దాలుగా వెలుగు నింపుతున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) సేవలు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా తాత్కాలికంగా ఎదురైన క్లిష్టమైన సమస్యను, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విజయవంతంగా పరిష్కరించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా RDT సేవలను స్వయంగా పర్యవేక్షించిన నారా లోకేష్, ఆ సంస్థ ప్రజలకు అందిస్తున్న విద్య, వైద్యం, ఉపాధి సహాయాన్ని అద్భుతమని ప్రశంసించారు. ఆ సమయంలోనే సంస్థ ఎదుర్కొంటున్న లైసెన్స్ రెన్యువల్ సమస్య గురించి తెలుసుకున్న ఆయన, ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకునే బాధ్యత నాది అని సంస్థ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్‌కు మాటిచ్చారు.మాట ఇచ్చిన కొద్ది కాలంలోనే లోకేష్ , కేంద్రాన్ని సంప్రదించి, RDT లైసెన్స్ పునరుద్ధరణకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించారు.

RDT సంస్థకు ఏర్పడిన సమస్య పరిష్కారం కావడంతో, రాబోయే ఒకటి, రెండు రోజుల్లో ఆ సంస్థ కార్యకలాపాలకు, సేవలకు ఏర్పడిన ప్రతిబంధకాలన్నీ తొలగిపోనున్నాయి. ఇది కేవలం RDT సంస్థకు మాత్రమే కాదు, ఆ సంస్థ సేవలను పొందుతున్న లక్షలాది మంది ప్రజలకు ఒక వరం వంటిది. విద్య, వైద్యం, ఆర్థిక చేయూత, ఉపాధి రంగాల ద్వారా ఏళ్లుగా సేవలు అందిస్తున్న RDT మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేయనుంది.
ఒక మానవతా సంస్థకు ఎదురైన జఠిలమైన సమస్యను, అత్యంత చురుకుగా మరియు చాకచక్యంగా కేంద్రంతో మాట్లాడి పరిష్కరించిన మంత్రి నారా లోకేష్ కృషిని ప్రజలు,లబ్ధిదారులు అభినందిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా, లోకేష్ తమపై మరింత నమ్మకాన్ని పెంచుకున్నారు.












Click it and Unblock the Notifications