నాగార్జునకు ఊరట!: ఎన్ కన్వెన్షన్‌పై మధ్యంతర ఉత్తర్వు
హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ అక్రమ కట్టడమని అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో అక్కినేని నాగార్జున రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణకు స్వీకరించింది. నాగార్జున పిటిషన్ స్వీకరించిన కోర్టు... యధాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్ రెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ కన్వెన్షన్‌ను లీజుకు తీసుకున్న ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధి ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటి పైన పూర్తిస్థాయి విచారణ చేపట్టడానికి న్యాయమూర్తికి సమయం లేక ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేశారు.

కాగా, ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేసిన విషయం తెలిసిందే. రెడ్ కలర్‌తో వారు మార్క్ చేశారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సెక్షన్ 452 ప్రకారం వారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. యాజమాన్యం నోటీసులు తీసుకోకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడలకు నోటీసులు అంటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications