వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు దిశగా టిడిపి: మౌనిక ఆనందం, ఇంట్లోంచి బయటకు రాని జగన్

నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు హైదరాబాదులోని లోటస్ పాండు వైసిపి కార్యాలయంలో సందడి కనిపించింది. పలువురు నేతలు, కార్యకర్తలతో సందడిగా కనిపించింది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు హైదరాబాదులోని లోటస్ పాండు వైసిపి కార్యాలయంలో సందడి కనిపించింది. పలువురు నేతలు, కార్యకర్తలతో సందడిగా కనిపించింది.

నంద్యాల ఉప ఎన్నిక: రెచ్చగొట్టొద్దు... గెలిచినా ఇవన్నీ నిషేధంనంద్యాల ఉప ఎన్నిక: రెచ్చగొట్టొద్దు... గెలిచినా ఇవన్నీ నిషేధం

తొలి నాలుగు రౌండ్లలో టిడిపి సత్తా చాటిన విషయం తెలిసిందే. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రతి రౌండులోను మెజార్టీ సాధిస్తూ వెళ్తున్నారు.

వైసిపి ఆఫీస్‌లో మొదట సందడి.. ఆ తర్వాత నిరుత్సాహం

వైసిపి ఆఫీస్‌లో మొదట సందడి.. ఆ తర్వాత నిరుత్సాహం

కానీ తొలి రెండు రెండు మూడు రౌండ్లు వెలువడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎలాంటి సందడి కనిపించలేదు. పార్టీ కార్యాలయం ఒక్కసారిగా వెలవెలబోయింది.

Recommended Video

Nandyal Bypoll: TDP using State Money to Fight Elections : N Raghuveera Reddy
బయటకు రాని జగన్

బయటకు రాని జగన్

వైసిపి కార్యాలయం నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేదు. జగన్‌కు ఆరోగ్యం బాగాలేదని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు.

ప్రజలు బయటకు వచ్చి ఓటేశారు

ప్రజలు బయటకు వచ్చి ఓటేశారు

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్లలో టిడిపి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి నాగ మౌనిక విలేకరులతో మాట్లాడారు. తాము గెలుపు దిశగా దూసుకెళ్తున్నామని చెప్పారు. తాము అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల మద్దతు తమ కుటుంబానికి ఉందన్నారు. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి టిడిపికి ఓటేశారన్నారు.

జగన్ వల్ల ఫలితం లేదు, అభ్యర్థి ఎన్నికలోనే

జగన్ వల్ల ఫలితం లేదు, అభ్యర్థి ఎన్నికలోనే

వైసిపి అధినేత జగన్ 13 రోజులు ప్రచారం చేసినా ఎలాంటి ఫలితే లేదని నాగమౌనిక అన్నారు. తాము మొదటి నుంచి గెలుస్తామని చెబుతున్నామన్నారు. శిల్పా మోహన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడమే జగన్ చేసిన తొలి తప్పు అని ఆమె అభిప్రాయపడ్డారు.

మాకు వేలాదిమంది ధైర్యం చెప్పారు

మాకు వేలాదిమంది ధైర్యం చెప్పారు

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తమకు వేలాదిమంది ధైర్యం చెప్పారని నాగమౌనిక అన్నారు. తమకు అండగా నిలబడ్డారని తెలిపారు. ముస్లీం సహా అన్ని వర్గాలు తమకు అండగా నిలిచాయని చెప్పారు. మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. రోజా వ్యాఖ్యలు బాధ కలిగించాయని, కానీ ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు.

దూసుకెళ్తున్న టిడిపి

దూసుకెళ్తున్న టిడిపి

నంద్యాల ఉప ఎన్నికల్లో తొలి నాలుగు రౌండ్లు ముగిసేసరికి టిడిపి మంచి ఊపు మీద ఉంది. నాలుగు రౌండ్లలోను టిడిపి సత్తా చాటింది. వైసిపి పుంజుకోలేదు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టిడిపి మెజార్టీ 9వేలకు పైగా ఉంది.

English summary
Telugu Desam Party’s Bhuma Brahmananda Reddy (17,695 votes) leading after 3rd round counting, YSRCP 11,624, Congress 142 in Nandyal bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X