అదే నోటితో..: జైపాల్‌పై రేవంత్ ఫైర్, సోనియా బలిదేవత

ఒకప్పుడు సోనియాను ఇటలీ వనిత అన్న జైపాల్ ఇప్పుడు వీరవనిత అంటున్నారని ఎద్దేవా చేశారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీని పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉరి తీయాలని చెప్పలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులు వెళ్లి వేర్వేరు అభిప్రాయాలు చెప్పడం ఇరు ప్రాంతాలను రెచ్చగొట్టడం కాదా అన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఆమెను దేవత అని టి కాంగ్రెసు నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. సోనియా వల్లనే వెయ్యి మంది తెలంగాణ యువత బలిదానం చేసుకుందని మండిపడ్డారు. సోనియాకు గుడి కట్టుతామని చెబుతున్న టి కాంగ్రెసు నేతలు వెయ్యి మంది విద్యార్థుల సమాధుల మధ్య కట్టాలన్నారు. అక్కడ కట్టిన దానికి బలి దేవత అని బిరుదు ఇస్తే సరిపోతుందన్నారు.
తెలంగాణ కాంగ్రెసు నేతలు జైత్రయాత్రల పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం వల్లనే తెలంగాణ కల సాకారమవుతోందన్నారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి తెలంగాణకు మార్గం సుగమం చేయాలన్నారు.
అధిష్టానాన్ని, కేంద్రాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జివోఎం భేటికి కాంగ్రెసు రెండు అభిప్రాయాలు చెప్పి ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతోందన్నారు.












Click it and Unblock the Notifications