టికి పట్టిన శని: కెసిఆర్‌పై రేవంత్, భజన చేస్తున్నారని..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముందు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కెసిఆర్‌కు అలవాటేనని అన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏపి సిఎం చంద్రబాబును కారణంగా చూపడం సరికాదన్నారు.
తెలంగాణకు పట్టిన శనిగా కెసిఆర్ తయారయ్యారని ఆరోపించారు. కెసిఆర్ వాస్తవాలను వక్రీకరించి, రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే రూ. 1490ఖర్చుతో 900 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎండిన పంటలకు, రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబేనని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాగినోడి మాదిరిగా కెసిఆర్ మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. విద్యుత్ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే సమష్టిగా అందరం కలిసి సాధించుకుందామని అన్నారు. సిఎం క్యాంప్ ఆఫీసులో కెసిఆర్ కాలక్షేపం చేస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన భజనలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ ఇష్టమొచ్చినట్లు పాలన కొనసాగిస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఉండగలమని రేవంత్ అన్నారు. కెసిఆర్ ఆస్తులను ఏమైనా అడిగామా అని ఆయన అన్నారు.
కాళ్లు పట్టుకుని, బెదిరించుకుని కెసిఆర్ తన పార్టీలో ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకున్నప్పటికీ చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదని అన్నారు. ల్యాంకో నుంచి 150 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ల్యాంకో ఫైలును కెసిఆర్ తిప్పి పంపారని రేవంత్ రెడ్డి తెలిపారు. 2017, అక్టోబర్ 25నాటికి తెలంగాణ ప్రాజెక్టులు లక్ష్యాలు సాధిస్తే తాను ఏ శిక్షకైనా, ముక్కు నేలకు రాసేందుకైనా సిద్ధమేనని అన్నారు.












Click it and Unblock the Notifications