మీ దేవతే అధికారాలిచ్చింది: కెసిఆర్‌పై రేవంత్ ఫైర్

Reventh Reddy fires at KCR
హైదరాబాద్: గవర్నర్‌కు అధికారాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్, ఇతర తెలంగాణ రాష్ట్ర సమితి నేతల వైఖరిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తమ దేవత అని అన్నారని గుర్తు చేశారు.

ఆ దేవతే గవర్నర్‌కు అధికారాలిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభకు వచ్చిన విభజన బిల్లులోనే గవర్నర్‌కు అధికారాల విషయం ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవడానికి కారణం కెసిఆరేనని ఆరోపించారు.

విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్న రేవంత్ రెడ్డి.. వారినే ఇప్పుడు పోలీసులతో తన్నిస్తున్నారని కెసిఆర్‌పై మండిపడ్డారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేస్తున్న విద్యార్థులతో ఎందుకు చర్చలు జరపరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ సమస్య తీర్చమని అడిగిన రైతుల కాళ్లు విరగ్గొడుతున్నారని, ఉద్యోగాలు అడుగుతున్న విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

విద్యార్థుల త్యాగాల వల్లే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం మరిచిపోరాదని హితవు పలికారు. మంత్రి హరీశ్ రావు లేఖ రాయాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి కాదని.. తెలంగాణ సిఎం కెసిఆర్‌కు అని రేవంత్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+