వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఉపఎన్నికపై ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే! టీడీపీకే గెలుపు ఛాన్స్?

నంద్యాల ఉపఎన్నికపై ఆర్జీ ఫ్లాష్ టీం తన సర్వేలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో వెల్లడించింది. ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి) కోసం ఆర్జీ ఫ్లాష్ టీం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉపఎన్నికపై ఆర్జీ ఫ్లాష్ టీం తన సర్వేలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో వెల్లడించింది. ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి) కోసం ఆర్జీ ఫ్లాష్ టీం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

ఓట్ల శాతం.. ఎవరికెంత?

టీడీపీ : 54.00 % - 56.78 %
వైసీపీ: 36.00 % - 38.53 %
కాంగ్రెస్ : 3.00 % - 4.49 %
ఇతరులు: 5.00 %

ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వేలో టీడీపీకి అత్యధికంగా 54.00 శాతం నుంచి 56.78 శాతానికిపైగా ఓట్లు పడే అవకాశం ఉందని తేలింది. నంద్యాల కోటలో టీడీపీ జెండా ఎగురవేస్తుందని కూడా సర్వే వెల్లడించింది.

nandyal-railway-station

ఇక వైసీపీ రెండో స్థానంలో ఉందని 36.00 శాతం నుంచి 38.53 శాతం ఓట్లు దానికి వస్తాయని, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తో కలుపుకొని సర్వే ఈ నంబర్ వెల్లడించింది. టీడీపీ సంగతే తీసుకుంటే... 54 శాతానికిపైగా ఓట్లు కచ్చితంగా వస్తాయని, గరిష్టంగా 56.78 శాతం వచ్చే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది.

రెండో స్థానంలో ఉన్న వైసీపీకి కనీసం 36 శాతం ఓట్లు వచ్చేలా కనిపిస్తున్నాయని, గరిష్టంగా, ఊపును బట్టి 38.53 శాతం వరకూ రావొచ్చని ఫ్లాష్ టీమ్ సర్వే ఘంటాపథంగా చెబుతోంది.
ఇక మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టి వ్యూహాత్మకంగా బరిలో దిగిన కాంగ్రెస్ 3 శాతం వరకూ ఓట్లు చీల్చగల్గినట్టు కనిపిస్తోందని, గరిష్టంగా 4.49 శాతం వరకూ ఓట్లు కాంగ్రెస్ కి పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక రాయలసీమ సాధన సమితి, ఇండిపెండెంట్లు లాంటి అభ్యర్థులంతా 5 శాతం వరకూ ఓట్లు చీల్చినట్టు కనిపిస్తున్నారని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే వెల్లడించింది. టీడీపీ వైపీసీ మద్య మార్జిన్ దాదాపు 18 శాతానికిపైగా ఉంది కాబట్టి...ఈ ఇతరులు కానీ కాంగ్రెస్ కానీ ఫలితాన్ని తారుమారు చేయలేవని తెలిపింది.

అధికార విపక్షాల మధ్య ఓట్ల తేడా 18 శాతానికిపైగానే ఉంటుందని, అంతే ఉజ్జాయింపుగా లెక్కేస్తే దాదాపు 20 వేల మెజారిటీ రావడం ఖాయమని ఫ్లాష్ టీమ్ సర్వేలో తెలిపింది. మామూలుగా పదిశాతం ఓట్లు అంటే నంద్యాల్లో ఉన్న పరిస్థితిని బట్టీ పదివేల ఓట్లు తేడా ఉంటుందని ముందు నుంచి లెక్కలు వస్తున్నాయ్.

అంటే ఈ సర్వేని బట్టీ మార్జిన్ 18 శాతం వరకూ ఉంది కాబట్టి 20 వేలకిపైగా మెజారిటీ రావడం ఖాయంగా అనిపిస్తోందని సర్వే తెలిపింది. సర్వే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2 శాతంగా ఉందని, అంటే ఫలితం కాస్త అటు ఇటుగా ఉండొచ్చని, రెండు శాతం ఓట్లు ఎక్కువ కూడా వచ్చే అవకాశముందని ఈ సర్వే చెబుతోంది.

అందుకే టీడీపీకి 54 నుంచి 56 శాతం ఓట్లు వస్తాయని సర్వే లెక్కేస్తోంది. వైసీపీకి కూడా కనీసం 36 శాతం, గరిష్టంగా 38 శాతం వస్తాయని సర్వే తెలిపింది. 36 శాతం కన్నా కొంచెం పెరిగే అవకాశమే కానీ తగ్గే ఛాన్స్ లేదని ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే తేల్చి చెబుతోంది.

English summary
Andhrajyothy had published a Pre-Poll Survey Results of Nandhyal By-Elections. According to their findings, TDP will amass 54.00 % - 56.78 % and YSR Congress will just manage 36.00 % - 38.53 %. Congress will be in a distant third position with 5.98% Vote Share. RG Flash Team is the Survey Team which worked for Lagadapati Rajagopal for 2014 Elections. Back then, they managed to get the result close. It has to be seen what will happen this time. Their findings indicate that it is an easy win for TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X