అమరావతిపై రూ.కోట్లు ఖర్చు పెట్టేబదులు: బాబుకు వర్మ 'మైండ్ బ్లోయింగ్' సలహా

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ సూచన చేశారు.

Recommended Video

    Bahubalian Assembly : RGV's Mindblowing idea to AP government మైండ్ బ్లోయింగ్ సలహా| Oneindia Telugu

    అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ సూచన చేశారు.

    ప్రపంచస్థాయి నగరంగా అమరావతి కోసం

    ప్రపంచస్థాయి నగరంగా అమరావతి కోసం

    అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారు. ఇందుకోసం డిజైన్లు తుది దశలో ఉన్నాయి. అసెంబ్లీ, హైకోర్టు తదితర నిర్మాణాలను ప్రపంచస్థాయిలో ఉండాలని భావిస్తున్నారు.

     రాజమౌళి సలహాలు

    రాజమౌళి సలహాలు

    ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రభుత్వానికి అందించింది. అయితే, మరింత గొప్పగా డిజైన్లు ఉండాలంటూ చంద్రబాబు సూచించారు. అంతేకాదు, దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం సూచించారు.

     కోట్లాది రూపాయలు ఖర్చు చేసే బదులు

    కోట్లాది రూపాయలు ఖర్చు చేసే బదులు

    ఈ నేపథ్యంలో వర్మ తనదైన శైలిలో స్పందించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం దండగ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి ఒక గొప్ప సలహాను (మైండ్ బ్లోయింగ్ ఐడియా) ఇస్తున్నానని చెప్పారు.

     గ్రీన్ మ్యాట్ అసెంబ్లీ, రాజమౌళి సహకారంతో సీజీ

    గ్రీన్ మ్యాట్ అసెంబ్లీ, రాజమౌళి సహకారంతో సీజీ

    అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్కీన్ ముందు నిర్వహించాలని, ఆ తర్వాత రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి టెలికాస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని వర్మ అన్నారు. ఇలా చేస్తే మన అసెంబ్లీ ప్రపంచంలోని అన్ని అసెంబ్లీల కన్నా గొప్పగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఇది బాహుబలియన్ అసెంబ్లీ కాబట్టి అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+