ఇజం బాగాలేదు కానీ, తప్పుదోవపట్టిస్తాయ్ జాగ్రత్త: పవన్ కళ్యాణ్‌కు వర్మ ఓపెన్ లెటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి స్పందించారు. తనకు పవన్ రాసిన ఇజం పుస్తకం కంటే పవనిజమే బాగా నచ్చిందని కితాబిచ్చారు.

పవన్ కళ్యాణ్‌కు వర్మ బహిరంగ లేఖ

పవన్ కళ్యాణ్‌కు వర్మ బహిరంగ లేఖ

ప్రస్తుతం ఉన్న సమాజానికి కావాల్సింది వంద శాతం పవనిజమేనని వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. పవన్ రాసిన ఇజం పుస్తకం చదివిన తర్వాత ఆయనకు ఓ బహిరంగ లేఖ రాయాలని, దీనిని రాస్తున్నట్లు చెప్పారు.

జనసేన బాగా నచ్చింది

జనసేన బాగా నచ్చింది

ఇజం గురించి మాట్లాడేముందు పవన్ కళ్యాణ్‌కు ఓ విషయం చెప్పాలని, పార్టీ పెట్టాలన్న మీ ఐడియా తనకు చాలా నచ్చిందని, మీలో ఎప్పుడూ నచ్చేది మీ నిజాయతీనే అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు మీరు జనసేన పెట్టిన తర్వాత మొదటిసారి ఇచ్చిన ప్రసంగం కూడా చాలా నచ్చిందని పేర్కొన్నారు.

మిమ్మల్ని ఆ అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి

మిమ్మల్ని ఆ అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి

పవన్ కళ్యాణ్ ఇజం అనే పుస్తకాన్ని రాశారని తెలీగానే తనలో ఏదో తెలీని ఉత్సుకత అని, చిన్నప్పటి నుంచి విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉండడంతో ఈ పుస్తకం కూడా చదివానని, పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు, భావాలను చదివాక నాకు ఒక్కటే అర్థమైందని, ఆ పుస్తకంలో ఉన్నదాని కంటే ఎక్కువ జ్ఞానం మీలో ఉందని, అదీ కాకుండా మిమ్మల్ని చాలా అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.

సమాజానికి కావాల్సింది పవనిజం

సమాజానికి కావాల్సింది పవనిజం

ఇప్పుడు సమాజానికి కావాల్సింది 100 శాతం పవనిజం అని, బ్రూస్లీ గొప్ప మార్షల్‌ ఆర్టిస్టే కాదు గొప్ప దార్శనికుడు కూడా అని వర్మ పేర్కొన్నారు. జ్ఞానం అనేది పైకి ఎక్కడానికి ఉపయోగించే నిచ్చెనలా ఉండాలని బ్రూస్లీ కూడా చెబుతుండేవారని, మనం ఎక్కిన మెట్టును వదిలి మరో మెట్టు ఎక్కాలని, అంతేకానీ మనం ఎక్కిన మెట్లన్నీ పోగేస్తే మరింత పైకి వెళ్లలేమని, మనల్ని ముందుకు నడిపించేదాన్ని మనం నడిపించకూడదన్నారు.

పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటున్నా

పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటున్నా

నేను ఇక్కడ బ్రూస్లీ గురించి ప్రస్తావించడానికి కారణం ఉందని, అతని స్టైల్‌ విభిన్నమైనదని, ఎందుకంటే అతను మరొకరిని చూసి నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదని, మనమేం ఆలోచించాలన్నా ఏం చెప్పాలన్నా అది మన స్టైల్లోనే ఉండాలని, కాబట్టి పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా ఆయనను ఒక్కటే వేడుకొంటున్నానని, చెడు విషయాలు, ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలని వర్మ హితవు పలికారు.

ఇజం నిరాశపరిచింది, కానీ

ఇజం నిరాశపరిచింది, కానీ

పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకం తనను నిరాశపరిచిందని వర్మ అన్నారు. కానీ తనకు పవనిజంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'This is an open letter I wrote to Pawan Kalyan after i read his book ISM on PAWANISM' Ram Gopal Varma letter to Pawan Kalyan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి