రిషికేశ్వరి పట్ల ప్రెషర్స్ డే నాడే అనుచిత ప్రవర్తన: ఎవరు, ఆ రోజేం జరిగింది!?

గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి కొత్త విద్యార్థుల ప్రెషర్స్ డే వేడుకల్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు కారణమని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పోలీసుల దర్యాఫ్తు ఈ దిశలో ఉన్నదని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ప్రెషర్స్ డే వేడుకల్లో రిషికేశ్వరి వేదిక పైకి ఎక్కేటప్పుడు, కార్యక్రమం అనంతరం వేదిక దిగి కిందకు వచ్చేటప్పుడు ఇద్దరు విద్యార్థులు ఆమె తీవ్రంగా బాధపడేలా వ్యవహరించారని తెలుస్తోంది.

 Rishikeshwari

దీంతో, అసలు ఆ రోజు ఏం జరిగింది? రిషికేశ్వరి పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారు ఎవరు? అనే విషయాలు తెలుసుకునేందుకు నాటి కార్యక్రమానికి సంబంధించిన ఆడియో, వీడియో సీడీలను పోలీసులు సేకరించారని తెలుస్తోంది. కొందరు విద్యార్థులతో పోలీసులు మాట్లాడారు.

ఇదిలా ఉండగా, ఆర్కిటెక్చర్ విద్యార్థులతో కళాశాల వైస్ ఛాన్సలర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. పది రోజుల సెలవుల అనంతరం విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలలను 5న పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు ప్రత్యేకించి ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులతో ఇంఛార్జ్ విసి ఆచార్య సాంబశివ రావు మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+