యూట్యూబ్ ఛానల్ పై తేల్చేసిన రోజా -సోషల్ అకౌంట్లపైనా క్లారిటీ.. !
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసేవారు. ముఖ్యంగా జగన్ ను, వైసీపీని ఉద్దేశించి ఆమె పెట్టే ట్వీట్లకు, పోస్టులకు భారీగానే స్పందన కూడా ఉండేది. కానీ అధికారం కోల్పోయాక ఆమె పేరుతో నడుస్తున్న సోషల్ మీడియా అకౌంట్ల కేంద్రంగా వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఆమె పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్లో తిరుమల లడ్డూ, కూటమి 100 రోజుల పాలనపై మూడు పోల్స్ దర్శనమిచ్చాయి. వాటిపై వివాదం చెలరేగడంతో ఆమె ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
ఈ మేరకు ఆర్కే రోజా ఇవాళ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. అందరికీ నమస్కారం!!నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరంటూ మొదలుపెట్టి.. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నానని రోజా తెలిపారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరని ఆమె పేర్కొన్నారు.

అందరికీ నమస్కారం!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2024
నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు.
నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను,
నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై…
తనపై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటని ఆర్కే రోజా తెలిపారు. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్ లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయంటూ ఆమె హెచ్చరికలు జారీ చేశారు. అలాగే నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను అంటూ తన ట్వీట్ ముగించారు.












Click it and Unblock the Notifications