ప్రజలు కష్టాల్లో..ఏపీ సీఎం రియాల్టీ షోలో..!
ఏపీలో కూటమి పాలనపై మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని ఆమె ధ్వజమెత్తారు.. మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని రోజా వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు,అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరమని , ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లే జరుగుతున్నాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ ఆడపిల్లలను నరికి చంపుతున్నారు. కాలేజ్‌కు వెళ్లే యువతలను తీసుకువెళ్లి తగలబెట్టి చంపుతున్నారు.ఈ ఘటనలతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సాగుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుందని రోజా వ్యాఖ్యానించారు. చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరస లేకుండా మతిస్థిమితం లేని వారిని కూడా చూడకుండా ఎవ్వరిని వదల పెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కల్లారా చూస్తున్నామని రోజా తెలిపారు.

ఈ రాష్ట్ర చరిత్రలో ఈ నాలుగు నెలలోనే జరిగినన్నీ దారుణాలు ఎప్పుడు కూడా జరగలేదని మాజీ మంత్రి రోజా చెప్పుకొచ్చారు. ప్రజలు కష్టాలతో అల్లాడుతున్నారని, డయేరియా వ్యాధి వచ్చి 11 మంది చనిపోయారు, ఆడపిల్లలపై అత్యాచారాలు చేసి చంపుతుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి బాధితుల కుటుంబాలను పరామర్శించారా అని కూటమి ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్‌కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు గుప్పించారు.
శుక్రవారం వస్తే చాలు కూటమి నేతలంతా కూడా హైదరాబాద్‌కు వస్తున్నారని, అఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హైదరాబాద్‌లో విహారయాత్ర చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం తన బామర్ది షోకు వచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేల్‌లో ఆడపిల్లను అత్యాచారం చేసి,తగులబెట్టారని, ఆ పాప ప్రాణాలతో పోరాడి మరణించిందని, దీనికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మినిస్టర్ అనిత ఎవరికి ఇది పట్టదని వాళ్లకు అధికారాన్ని ఎంజాయ్ చెయడమే తెలుసంటూ రోజా తెలిపారు.
కష్టాల్లో ప్రజలు... రియాల్టీ షోలో చంద్రబాబు - @RojaSelvamaniRK #RojaSelvamani #RKRoja #Chandrababu #CMChandrababu #TDP #YSRCP #Oneindiatelugu pic.twitter.com/VW9iiYJCmg
— oneindiatelugu (@oneindiatelugu) October 20, 2024
రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాప్‌బుల్ కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లరంటూ రోజా సీఎం తీరుపై మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండరని రోజా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై రోజా ఫైర్ అయ్యారు.
తన సొంత నియోజకవర్గంలోనే అత్త, కోడళ్లపై అత్యాచారం జరిగిదే వారి కుటుంబాన్ని పరామర్శించి, భరోసా ఇవ్వడానికి సమయం లేని బాలకృష్ణ, అన్‌స్టాప్‌బుల్ షో చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లకా మేము ఓట్లు వేసిందని ప్రజలు బాధపడుతున్నారని రోజా తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊరుకునే పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వానికి రోజా వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, లేదంటే వైఎస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోందని చంద్రబాబు ప్రభుత్వాన్ని రోజా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications