లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వర్మ ఆఫర్: రోజా ఏమన్నారంటే..?

Subscribe to Oneindia Telugu
Roja Character in Lakshmi's NTR రోజా ఏమన్నారంటే..? | Oneindia Telugu

హైదరాబాద్/చిత్తూరు: సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఆఫర్‌పై సినీ నటి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తన దర్శకత్వంలో రాబోతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో రోజాకు అవకాశం ఇస్తానని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.

వర్మ ఆఫర్‌కు రోజా సానుకూలంగా..

వర్మ ఆఫర్‌కు రోజా సానుకూలంగా..

కాగా, వర్మ ఆఫర్‌పై సానుకూలంగా స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మంచి రోల్ ఇస్తే నటిస్తానన్నారు. వర్మ ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో తనకు తెలియదని ఆమె చెప్పారు. వర్మ సంప్రదించాక అన్ని వివరాలూ వెల్లడిస్తానన్నారు.

గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా..

గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా..

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా ఇటీవలి కాలంలో సినిమాల్లో నటించడం లేదు. రాజకీయంగా, బుల్లితెర కార్యక్రమాల్లో ఆమె బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆఫర్‌పై ఆమె సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లక్ష్మీపార్వతి అడుగుపెట్టాక..

లక్ష్మీపార్వతి అడుగుపెట్టాక..

ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తొలుత ప్రకటించిన వర్మ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను సినిమాగా తీస్తానని వర్మ ప్రకటించారు. సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రోజాకు అవకాశం.. సంతోషమే..

రోజాకు అవకాశం.. సంతోషమే..

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి దర్శకుడు రాంగోపాల్‌వర్మ వెళ్లారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే దాకా జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తామన్నారు. చిత్రంలో పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరనీ నిర్ణయించలేదని తెలిపారు. ఈ చిత్రంలో ఎమ్మెల్యే రోజాకు అవకాశం ఉంటుందని వర్మ అన్నారు. ఎన్టీ రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయడం సంతోషమన్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాకు ఎంత ఖర్చయినా భరిస్తానని నిర్మాత అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA RK Roja on Tuesday responded on Cine Director Ram Gopal Varma cinema offer in Lakshmi's NTR.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి