కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్‌తో మహిళలకు వల: లాడ్జికి రప్పించి నగ్న చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఓ దారుణమైన మోసగాడు పోలీసుల చేతికి చిక్కాడు. ఫేస్‌బుక్ ద్వారా వల వేసి ఉద్యోగమిస్తానంటూ నమ్మించి మహిళలను లాడ్జికి రప్పించి నగ్నచిత్రాలు తీసి అతను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడో ఆర్ఎంపి డాక్టర్. బ్లాక్ మెయిల్ చేసి మహిళ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కుంటున్నాడు.

కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన ఆ మోసగాడు అవుజ రాజ్‌కుమార్ అలియాస్ తేజర్షిని పోలీసులు అరెస్టు చేశారు. అతను డిగ్రీ వరకు చదువుకుని వెలుగోడులో కొంత కాలం ఆర్ఎంపి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత దొర్నిపాడు గ్రామంలో ఆర్ఎంపిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.

అయితే ఏడు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో మంచం పట్టాడు. కాలక్షేపం కోసం ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. తన బట్టతలకు విగ్ పెట్టుకుని ఉన్న ఫొటోను అందులో ఉంచి, అమ్మాయిలను ఆకర్షించే విధంగా కొటేషన్లు అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు.

RMP doctor arrested for black mailing woman

వాటికి ఆకర్షితులై కామెంట్ పెట్టిన అమ్మాయిలతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. క్రమంగా వారికి దగ్గరవుతూ వచ్చాడు. తన ఆస్పత్రిలో ఉద్యోగమిస్తానంటూ మాయమాటలుచెప్పి లాడ్జిలకు పిలిపించి వారిని లోబరుచుకునేవాడు. నగ్న ఫొటోలు కూడా తీసి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కునేవాడు.

అతని మోసానికి గురైన సికింద్రాబాదుకు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన ఓ వివాహిత ఫిర్యాదు చేయగా, కర్నూలు మూడో పట్టణం పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా ఫేస్‌బుక్‌ను ప్రయోగించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి పది తులాల బంగారు ఆభరణాలు, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

English summary
An RMP doctor Rajkumar has been arrested by Kurnool police for blackmailing women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X