తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం; పండుగ పూట విషాదం

పండుగపూట విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా దువ్వాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైజాగ్ నుంచి లోడ్‌తో లారీ నారాయణపురం వస్తుండగా తాడేపల్లిగూడెం వద్ద ఈ ఘటన జరిగింది. మృతులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Road Accident at Thadepalligudem; Four died, 10 people injured; Sankranti Festival Tragedy

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. చేపల లోడ్ తో వెళ్తున్న 14 టైర్ల భారీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది" అని ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి వీర చెప్పారు. రోడ్డు ప్రమాద ఘటనపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. లారీ విశాఖపట్నం జిల్లా దువ్వాడ నుంచి తాడేపల్లిగూడెం సమీపంలోని నారాయణపురం వెళ్తోందని, శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Road Accident at Thadepalligudem; Four died, 10 people injured; Sankranti Festival Tragedy

లారీపై ఒక డ్రైవర్‌, ఇతర కార్మికులు సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తులు మరియు గాయపడిన వారు ట్రక్కులో ఉండగా క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్ మరియు ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు డ్రైవర్‌పై కేసు బుక్ చేసారు, అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది అని పోలీసులు చెప్తున్నారు. గాయపడిన వారికి వైద్యం చేసిన తర్వాత వారు తదుపరి వివరాలను దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+