ఘోర రోడ్డు ప్రమాదం: శ్రీకాళహస్తి వెళ్లి వస్తూ ఐదుగురు మృతి

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: జిల్లాలోని బీఎన్‌ కండ్రిగ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

శ్రీకాళహస్తి వాయలింగేశ్వరుని దర్శించుకొని తిరిగి ఫ్యాక్టరీలో కూలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road accident in BN Kandriga: Five killed

మృతులలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు రామారావు, కుమారిలతో పాటు.. ఆటో డ్రైవర్ వెంకట్రాయలు, చిత్తూరు జిల్లా యదమర్రి మండలానికి చెందిన అక్కాతమ్ముళ్లు బిందు, అనంత్‌లు ఉన్నారు.
పండుగ పూట ఇలా జరగడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు నగర సమీపంలోని వెంకన్న బావి వద్ద రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన వినయ్‌గా గుర్తించారు. జిల్లాలోని వెల్దుర్తికి చెందిన ఓ యువతితో నాలుగు నెలల క్రితం వినయ్‌కి వివాహం అయింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five killed in a road accident occurred at BN Kandriga in Chittoor district on Tuesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి