ఆటో బోల్తా: నలుగురు మహిళల మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు
పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం కొండ దిగువన శనివారం జరిగిన ఆటో ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నాయిగూడెం, యాదవోలు గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు వెంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వచ్చారు.
దర్శన అనంతరం ఆటోలో తిరిగి వారి గ్రామాలకు వెళ్తుండగా కొండ దిగువన వేగాన్ని అదుపు చేసులేక ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నాయిగూడెంకు చెందిన విజయలక్ష్మీ, శశిరేఖ, కుమారి, సుజాతలు అక్కడికక్కడే మృతి చెందారు. సత్యవతి, ధనలక్ష్మీ రాజశేఖర్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ: ఒకరి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని రోడ్డు కం రైల్వే వంతెనపై శనివారం ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా జోగూరుపాడుకు చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం నుంచి గావరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications