టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు: ఆరుగురు మృతి
కృష్ణా: జిల్లాలోని నూజీవీడు మండలం తుక్కులూరు గ్రామం అడవి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో పదిమందికి గాయాలయ్యాయి

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... నూజీవీడు స్టేషన్ తోటకు చెందిన 30మంది జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనార్థం రెండు ట్రాలీ ఆటోల్లో బయలుదేరారు. తుక్కులూరు గ్రామం వద్ద ఆటోలను పక్కకు నిలిపి ఉంచిన సమయంలో ఎదురుగా వస్తున్న ఓ టిప్పర్ వారిపైకి దూసుకెళ్లింది.
కాగా, ఘటన అనంతరం టిప్పర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో గుర్రం శ్రీను(28), వీరయ్య(40), కిశోర్(18), శ్రీను(35), రాణి(20), చిన్న వెంకటేశ్వరరావు(70) మృతి చెందారు. వీరంతా ఒక కుటుంబానికి చెందినవారిగా సమాచారం. ఘటనా స్థలాన్ని నూజీవీడు రూరల్ ఎస్సై సీహెచ్ నాగప్రసాద్ పరిశీలించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications