టీ: చెప్పులతో చెంపలు వాయించుకుంటూ (ఫొటోలు)

తిరుపతి: తెలంగాణ ముసాయిదా నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంపై తిరుపతిలో ఆందోళనలు పెల్లుబుకాయి. తిరుపతికి వెళ్లే దారులన్నీ మూతపడ్డాయి. తిరుమలకు కాలినడకనే భక్తులు చేరుకుంటున్నారు. గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతున్నాయి.

సీమాంధ్రలో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. సీమాంధ్రలో బంద్ జరుగుతోంది. తిరుపతిలో సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ శుక్రవారం వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చిత్రాన్ని దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అర్థనగ్నంగా ప్రదర్శన చేశారు. రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. మానవహారం నిర్మించారు.

మానవహారం ఇలా...

మానవహారం ఇలా...

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు తిరుపతిలో మానవ హారం నిర్మించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

ప్రదర్శన ఇలా..

ప్రదర్శన ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఆందోళనకారులు రోడ్డు మీదికి వచ్చి ప్రదర్శన నిర్వహించారు.

అర్థనగ్న ప్రదర్శన...

అర్థనగ్న ప్రదర్శన...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఆందోళనకారులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

చెంపలు వాయించుకుంటూ...

చెంపలు వాయించుకుంటూ...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చెప్పులతో చెంపలు వాయించుకుంటూ ఇలా నిరసన వ్యక్తం చేశారు.

సోనియా చిత్రం ఇలా..

సోనియా చిత్రం ఇలా..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోనియా చిత్రాన్ని ఇలా భయంకరంగా ప్రదర్శించారు. ఇలా ఓ ప్రదర్సన ఏర్పాటు చేశారు.

దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ..

దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు తిరుపతిలో ఇలా టైర్లతో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

బ్లాక్ డే...

బ్లాక్ డే...

తెలంగాణ నోట్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన అక్టోబర్ 3వ తేదీని బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ప్రదర్శన నిర్వహించారు. జై సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించారు.

టైర్ల కాల్చివేత..

టైర్ల కాల్చివేత..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు టైర్లను దగ్ధం చేశారు.

భారీ భద్రత...

భారీ భద్రత...

తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాలను అప్రమత్తం చేశారు. భారీ భధ్రతా ఏర్పాట్లు చేశారు.

కెసిఆర్‌పై ఆగ్రహం

కెసిఆర్‌పై ఆగ్రహం

తిరుపతిలో సమైక్యాంధ్ర ఆందోళనకారులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఇలా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+