Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళపై తొలిసారి రౌడీషీట్‌ తెరిచారు: బస్సుల ఢీ, ఇద్దరు మృతి

విజయవాడ: రౌడీ షీటర్లంటే నేరాలకు పాల్పడే పురుషులే గుర్తుకు వస్తారు. అయితే, అందుకు భిన్నంగా ఓ మహిళపై కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. నగరంలో గత 15 ఏళ్లలో ఓ మహిళపై రౌడీ షీట్ తెరవడం ఇదే తొలిసారి.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 32ఏళ్ల మహిళపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఈ రౌడీషీట్ తెరిచారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నేరాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆమెపై రౌడీ షీట్ తెరిచినట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరని వారు స్పష్టం చేశారు.

Roady Sheet opened on a Woman in Vijayawada

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: ఇద్దరు మృతి

చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును, శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. రెండు బస్సుల్లో మొత్తం 80మంది ప్రయాణికులున్నారు. వీరిలో దాదాపు 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా పూతలపట్టు-నాయుడిపేట ప్రధాన రహదారిపై దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

తండ్రిపై కుమారుడి దాడి

కర్నూలు: కన్న కొడుకే కత్తితో దాడి చేయడంతో ఓ తండ్రి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రుద్రవరం మండలం ఆలమూరులో తండ్రిపై కొడుకు సోమవారం ఉదయం కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+