కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రోజా.. పవన్‌ను రష్యా అల్లుడు అంటూ సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. మూలన ఉండే ముసలమ్మ కూడా నొక్కుతుంది బటన్ అన్న చంద్రబాబు.. ఆయన కూడా ముసులోడే కదా... మరి బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు. జగన్ అనుకుని ఉంటే నాడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండేది కాదని.. టీడీపీలా నీచరాజకీయాలు చేయలేదని అన్నారు. ఎక్కడైనా ప్రతిపక్షం లేని రాష్ట్రం ఉందా దేశంలో అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్‌ కచ్చితంగా అసెంబ్లీకి వస్తారని చెప్పారు. కూటమి తప్పులను ఎండగడతారని.. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే ప్రజల్లోనే ఉంటూ మీ తప్పులను ఎండగట్టి మెడలు వంచుతామన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 60కి పైగా ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉన్నప్పుడే మాట్లాడేందుకు మైకు ఇవ్వలేదని.. ఇప్పుడు ఎలా ఇస్తారని అనుకోవాలన్నారు. గవర్నర్ మీద గౌరవం ఉంది కాబట్టే.. జగన్ అసెంబ్లీకి వచ్చారని రోజా వ్యాఖ్యానించారు.

Roja fire against the coalition government satires on Pawan as Russia s son-in-law

ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తుతారని.. తప్పులు ఎక్కడ బయటపెడతారో అని భయం కూటమి నేతలని ఆవహించిందని తెలిపారు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎంత ధైర్యవంతుడో చంద్రబాబు సోనియా గాంధీలను అడిగితే చెబుతారన్నారు.ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపే PAC సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి ఇస్తారని.. కానీ మీరు మీ ఎమ్మెల్యేకే ఇచ్చారంటే ఎంత భయపడుతున్నారో తెలుస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇవ్వరు, PAC ఛైర్మెన్ ప్రతిపక్ష పార్టీ ఇవ్వరు, గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పిస్తారని ఫైర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకెందుకు పనికిరాడని రోజా నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఆవేశంతో ఊగిపోయి మాట్లాడితే.. నిజమని ప్రజలు ఓటేశారన్నారు. ఆయన రష్యా అల్లుడు కదా.. పక్కనే జర్మనీ గురించి బాగా తెలిసుంటుందని సెటైర్లు వేశారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. ప్రతిపక్ష హోదా తీసుకుని అసెంబ్లీలో ఎండగట్టండని సవాల్ చేశారు. హుందాతనం గురించి పవన్ మాట్లాడటం కామెడీగా ఉందని.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏదో చేస్తాడని ప్రజలు అనుకుంటారని.. కానీ పవన్ మాత్రం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అంటూ కామెంట్స్ చేశారు.

అలానే పిల్లలు ఇక్కడ నిరసన తెలుపుతుంటే.. మంత్రి లోకేష్ కలర్‌ఫుల్ కూలింగ్ గ్లాసులేసుకుని ఇండియా పాక్ మ్యాచ్‌ను దుబాయ్‌లో చూస్తున్నారని ఫైర్ అయ్యారు. పచ్చ ఛానెల్స్‌కు తన గురించి ఏదో ఒకటి వేయకుంటే టీఆర్‌పీ రేటింగ్స్ రావని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు భజన చేసే ఛానెల్స్ మాత్రమే అసెంబ్లీకి రావాలని రూల్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ తో పాటు 144 హామీలు ఇచ్చారని.. ఇవాళ ఏ హామీకి సంబంధించిన స్పష్టత ఇవ్వలేదన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన నేతలు సిండికేట్ లా మారి మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. మహిళలకు 1500, ఉచిత బస్సు, తల్లికి వందనం ప్రస్తావన లేదని ఆర్కే రోజా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+