వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ చెప్పాగా, రానివ్వండి: స్పీకర్‌కు రోజా, ఆమెపై టిడిపి 'చివరి' వ్యూహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను క్షమాపణ లేఖ ఇచ్చినందున తనను అసెంబ్లీ ఆవరణలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష కార్యాలయానికి అనుమతించాలని ఆ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా సభాపతి కోడెల శివప్రసాద రావును అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది.

గుడి దగ్గరనా, జగన్ గురించి మీకే తెలియదు: రోజాపై సుజాత, సింగపూర్లో నారాయణ

ఆమె మంగళవారం నాడు సభాపిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తనను అసెంబ్లీలోకి అనుమతించకపోయినా వైయస్సార్సీపీ ఎల్పీకి అనుమతించాలని కోరారు. అయితే, ఇది తాను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, బీఏసీ, సభలో నిర్ణయిస్తారని చెప్పారని సమాచారం.

Roja meets Speaker Kodela Siva Prasad Rao

కాగా, రోజా క్షమాపణ లేఖపై అసెంబ్లీ చివరిరోజు సభలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్దోంది. సభ తొలిరోజు కంటే చివరిరోజు చర్చించి, వచ్చే సమావేశాల నుంచి ఆమెను అనుమతిస్తే బాగుంటుందని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి సూచించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేపు రోజా క్షమాపణ రేపు అసెంబ్లీ ముందుకు రానుందని, ఈ అంశాన్ని క్లోజ్ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, రెండురోజల పాటు సాయంత్రం కూడా సభ నిర్వహించే అవకాశముందని సమాచారం. కృష్ణా పుష్కరాలు, రెయిన్ గన్లతో పంటలను కాపాడిన వాటితో పాటు ఇతర అంశాలను సభలో చర్చించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

English summary
YSRCP MLA Roja meets Speaker Kodela Siva Prasad Rao on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X