ఎదుర్కుంటా: టిడిపి ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలకు రోజా జవాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత పంపిన పరువు నష్టం నోటీసులు తనకు ఇంకా అందలేదని, అదిన తర్వాత చట్ట పరంగా ఎదుర్కొంటానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో రోజా-అనిత మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజా తన గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఎమ్మెల్యే అనిత కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు. మరొకరిపై ఈ విధంగా రోజా వ్యాఖ్యానించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయన్నారు. రోజాపై చర్యలు తీసుకోవాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోరినట్లు తెలిపారు. రోజా చేసిన వ్యాఖ్యల సీడీలు అధికారికంగా బయటకు విడుదల కావడంతో తన కుటుంబానికి తీవ్ర మనోవేదనను మిగిల్చాయని చెప్పారు.
ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి జరగవద్దనే ఉద్దేశ్యంతోనే రోజాపై పరువునష్టం దావా వేస్తున్నానని చెప్పారు. రోజాపై రూ.కోటికి పరువునష్టం దావా వేస్తానని అందుకు సంబంధించిన నోటీసును రోజాకు పంపించినట్లు ఎమ్మెల్యే అనిత తెలిపారు.












Click it and Unblock the Notifications