మా గొడవల వెనుక పెద్దలు ఉన్నారు- వీళ్లు పావులు అవుతున్నారు : జగన్ దగ్గరకు తీసుకెళ్తా -రోజా సంచలనం..!!
"మా" ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఎమ్మెల్యే..సినీ నటి రోజా ఆందోళన వ్యక్తం చేసారు. తాను చాలా సార్లు "మా" ఎన్నికలు చూసానని గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. అయితే, ఇంత వివాదం చోటు చేసుకోవటం పైన రోజా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసారు. తెర వెనుక ఉన్న కొందరు పెద్దలు ఈ విధంగా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పోటీలో ఉన్న అమాయకులు పావులుగా మారారంటూ వ్యాఖ్యానించారు. "మా" లో ఉన్న సభ్యులంగా సినీ ఇండస్ట్రీలో సభ్యులేనని..అందరూ కలిసే ఉంటారని చెప్పుకొచ్చారు.

వారికే మద్దతంటున్న రోజా
తాము సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే సమయం లో ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడు "మా" లోనూ కనిపిస్తున్నాయన్నారు. "మా" లో ఉన్న వారితో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎవరైతే తెర వెనుక ఉండి ఈ విధంగా చేస్తున్నారో.. వారే నేరుగా వచ్చి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ తప్పకుండా సహకరిస్తారని రోజా ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే తన ప్రమేయం లేకుండానే సినీ ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారని..వారు చెప్పిన సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించారని వివరించారు.

సీఎం దగ్గరకు తీసుకెళ్తా
ఇప్పుడు గెలిచిన ప్యానల్ ను సీఎం వద్దకు తీసుకెళ్లి.. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలో తనను భాగస్వామిని చేస్తే మరింత సంతోషిస్తానని చెప్పారు. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిచే వారే "మా" ఎన్నికల్లో గెలుస్తారని చెప్పారు. ఓడిన వారు సైతం గెలిచిన వారికి సహకరించి ఇండస్ట్రీ కోసం పని చేయాలని రోజా సూచించారు. మహిళా సభ్యులు సైతం పరస్పరం దూషించుకోవటం పైన రోజా ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఆ తరువాత రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అందరం ఒకే ఫ్యామిలీ
ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయంటూ.. సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయన్నారు. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని చెప్పారు. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. సమస్యలను ఇరూ రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

ఉద్రిక్తత..కొనసాగుతున్న పోలింగ్
రెండు ప్యానల్లో తనతో పని చేసిన వారె ఉన్నారన్నారు. చివరికి అందరం కలిసి కట్టుగా ఉంటామని రోజా స్పష్టం చేసారు. ఇక, సినీ నటి జెలీనియా ఓటు వేసేందుకు వచ్చారు. ఇక, పోలింగ్ మధ్యలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్ది సేపు ఉద్రిక్తత తరువాత పరిస్థితి కంట్రోల్ అయింది. ప్రస్తుతానికి 287 ఓట్లు పోలయినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications