రైతుల అడ్డగింతపై రోజా సీరియస్ ... చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ఇంచు కూడా కదలనివ్వమని వార్నింగ్
Recommended Video

నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజాకు రాజధాని అమరావతిలో రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చెయ్యటంతో నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను అడ్డుకుంది రాజధాని రైతులు కాదని, టీడీపీ గూండాలు అని ఆమె ఫైర్ అవుతున్నారు. ఇలాగే చేస్తే చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర ఇంచు కూడా కదలనివ్వం అని రోజా వార్నింగ్ ఇస్తున్నారు .

రోజాను అడ్డుకున్న రైతులు.. టీడీపీ గూండాల పనే అని రోజా సీరియస్
ఈరోజు ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో పాల్గొన్న రోజాను మహిళలు, రైతులు అడ్డుకున్నారు . అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. పెదపరిమి వద్ద రోజా వాహనాన్నిఅడ్డుకున్న రైతులు ఆందోళన చేశారు . అయితే ఇదంతా టీడీపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు రోజా . రైతుల ముసుగులో టీడీపీ గూండాలు వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని, ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా ఆరోపించారు.

తనపై దాడికి చంద్రబాబు కుట్ర పన్నారన్న రోజా
తనపై దాడికి చంద్రబాబు కుట్ర పన్నారని రోజా సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఎమ్మెల్యేలను అడ్డుకుని , చంద్రబాబు దృష్టి మరలించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు . ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని టీడీపీ అధినేత చంద్రబాబును హెచ్చరించారు రోజా . ఇక టీడీపీ నేతల తీరు మార్చుకోకుంటే ఏపీలో టీడీపీ ప్రజా చైతన్య యాత్రను ఇంచు కూడా కదలనివ్వం అని ఆమె మండిపడ్డారు . చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆపకుంటే తగిన శాస్తి జరుగుతుందని రోజా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

సీఆర్డీఏను ‘చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీ’గా మార్చారని ఆగ్రహం
ఇక మూడు రాజధానుల నిర్ణయం అన్ని ప్రాంతాల అభివృద్ధికి అని రోజా చెప్పారు. వైసీపీ సర్కార్ కు ఎవరిపైనా కుట్రలు చెయ్యాల్సినవసరం లేదని కక్ష సాధింపు అవసరం లేదని రోజా పేర్కొన్నారు. సీఆర్డీఏను ‘చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీ'గా మార్చారన్నారు. సీఆర్డీఏ పేరుతో పచ్చటి పొలాలను నాశనం చేశారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబును నమ్మి కుప్పం ప్రజలు నష్టపోయారన్నారు. ఇక రాజధాని ప్రజలను బాబు మోసం చేశారన్నారు .

మంగళగిరిలో లోకేష్ ఓటమి అందుకే అని ఎద్దేవా
4 వేల ఎకరాలకు పైగా దోచుకున్న చంద్రబాబు ప్రజారాజధాని పేరుతో ఓ సామాజిక వర్గానికి చెందిన వారికే రాజధాని కట్టారని ఆరోపించారు . రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారన్న రోజా దోచుకున్నారు కాబట్టే లోకేశ్‌ను చిత్తుగా ఓడించి బుద్ధిచెప్పారని విమర్శించారు. ఇక చంద్రబాబు పీఏ ఇంట్లో 2వేల కోట్లు అవినీతి సొమ్ము దొరికింది అంటే బాబు ఎంత అవినీతి చేసుంటారో అర్ధం అవుతుందన్నారు.

టీడీపీ అవినీతిపై దృష్టి మళ్లించేందుకే వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు
ఈ రోజుల్లో ఎవర్నీ మోసం చెయ్యటం అంత సాధ్యం కాదని రోజా పేర్కొన్నారు. అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న బాధతోనే ఇక ఇప్పుడు దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ రైతులకు ప్యాకేజీ పెంచారని, రైతులకు మద్దతుగా ఉన్నారన్నారు. కావాలని ప్రజల దృష్టి మళ్ళించటానికే చంద్రబాబు నానా ప్రయత్నాలు సాగిస్తున్నారని రోజా విమర్శలు గుప్పించారు .












Click it and Unblock the Notifications