"గంటా-అయ్యన్న మధ్య మ్యాచ్ ఫిక్సింగ్?.. బాబే విష్ణుకుమార్ రాజు నోరు మూయించారు"
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్దం అంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంటా కూడా సైలెంట్ అయ్యారని మండిపడ్డారు.
విజయవాడ: చూస్తుంటే విశాఖ భూకుంభకోణం వ్యవహారం కూడా తెరమరుగయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలంతా దీనిపై వ్యూహాత్మక మౌనం వహిస్తుండటంతో.. కుంభకోణంపై మాట్లాడటానికి అటు వైసీపీకి అవకాశం లేకుండా పోతోంది. ప్రత్యర్థి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా టీడీపీ నేతలు దీనిపై నోరు మెదిపేలా కనిపించడం లేదు.
తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి స్పందించారు. కుంభకోణంపై తొలుత దూకుడు ప్రదర్శించిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారని విమర్శించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు-అయ్యన్నపాత్రుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగిందని, అందువల్లే అయ్యన్న నోరు మెదపడం లేదని ఆరోపించారు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్దం అంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంటా కూడా సైలెంట్ అయ్యారని మండిపడ్డారు. భూఆక్రమణలు నిరూపిస్తామంటూ మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మౌనం వహిస్తున్నారని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సహాయంతో ఆయన నోటికి చంద్రబాబు తాళం వేశారని రోజా విమర్శించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications