కొత్త సంసారంలా వుంది: తెలుగు రాష్ట్రాలపై రోశయ్య ఆశాభావం
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్నోమార్పులు సంభవించాయని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సంసారం మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ సర్దుబాట్లు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే అన్నీ చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరారు. కాగా, కోస్తా జిల్లాల వారికి చైతన్యం ఎక్కువని, ఆ కారణంతోనే అన్ని రాజకీయ పార్టీల దృష్టీ ఇటువైపే ఉంటుందని రోశయ్య అన్నారు.
ఇక్కడి వారి ఆదరణ, అభిమానం పొందేందుకు పార్టీలు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. అయితే, ఇది మోతాదు మించకుండా చూసుకోవాలని రోశయ్య సూచించారు.












Click it and Unblock the Notifications