బీజేపీXటీడీపీ, టెన్షన్: ఇదీ బాబు ఆలోచన: బుద్ధా, గుళ్ల కూల్చివేతలో కొత్త కోణం!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: బెజవాడలో ఆలయాల కూల్చివేత బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అగాథం సృష్టిస్తోంది. కృష్ణా పుష్కరాల కోసం అధికారులు తొలగిస్తున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం నాడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు బీజేపీ నేతలు కూల్చివేసిన ఆలయాల ప్రాంతాలను సందర్శించారు. ఆలయాల తొలగింపు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఇంద్రకీలాద్రి గోశాల సమీపంలో బీజేపీ నేతలు విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

భయపెడుతున్నారు: టిడిపిపై కన్నా, బిజేపీపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

ఆ సమయంలో టిడిపి నేత బుద్ధా వెంకన్న, ఆయన అనుచరులు బీజేపీ నేతలను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతలు, టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆలయాల తొలగింపు సరికాదని బీజేపీ నేతలు అనగా, దానికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Row over temple demolition in Vijayawada, TDP activists stop BJP leaders

చంద్రబాబు ఆలోచన ఇదీ: బుద్ధా వెంకన్న

బీజేపీ నేతల ఆందోళన పైన టిడిపి నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. తాము బీజేపీ నేతలను అడ్డుకోలేదని చెప్పారు. ఇక్కడ ఆలయాలను తొలగించినప్పటికీ.. అన్ని ఆలయాలను కలిపి కొన్ని ఎకరాల్లో కడదామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా ఉందని, ఇంత మంచి ఆలోచనను స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదన్నారు.

చంద్రబాబు ఓ ప్రాంతంలో అన్ని గుడులను కట్టాలని భావిస్తున్నారని చెప్పారు. టిడిపి అధికారంలో ఉంటే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని, ఇప్పుడు గుడులు, చర్చిలు, మసీదులు అని కొందరు రాద్దాంతం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. నా ఇంటి వద్దకు వచ్చి బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

ఆలయాల కూల్చివేత.. కొత్త కోణం

బుద్ధా వెంకన్న మరో షాకింగ్ కామెంట్ కూడా చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గుడుల తొలగింపును రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతల పైన మండిపడ్డారు. వినాయకుడి గుడి, మరో గుడిని అధికారులు తొలగించారని, ఆ గుడులు వాళ్ల చేతుల్లో ఉన్నాయని అంటున్నారని చెప్పారు. ఈ గుడులను కూల్చి వేస్తే.. తమ చేతుల్లో ఉన్న అవి ఇతరుల చేతుల్లోకి వెళ్తాయని వారు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఏపీలో టిడిపి - బిజెపిలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. టిడిపి అధికారంలో ఉండగా, బీజేపీ ఏపీలో 2019 నాటికి కీలకంగా ఎదగాలని భావిస్తోంది. దీంతో, మిత్రపక్షమైనప్పటికీ సమస్యల పైన స్పందిస్తోంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా పైన టిడిపి నేతలు విమర్శలు చేసినప్పుడు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Row over temple demolition in Vijayawada, TDP activists stop BJP leaders at Gowshala in Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X