Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మతోడు : ఈ ఆట నాదే- ఈ వేట నాదే : తారక్ - చెర్రీ కబడ్డీ..రాజమౌళితో కలిసి..!!

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు ముందే సన్సేషన్ అవుతోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీ 2022 జనవరి 7న థియేటర్లలోకి రానుంది. భారీ అంచనాల నడుమ.. అంతకు మించిన ప్రమోషన్లతో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు..పాటలు ఇప్పటికే మోత పుట్టిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ముగ్గురు ఆర్ లకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దర్శకుడు రాజమౌళితో పాటుగా రాం చరణ్.. జూ ఎన్టీఆర్ కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

మాగ్నమ్ ఓపస్ మూవీ

ఇక, తాజాగా ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ప్రమోషన్ కోసం దర్శకుడు విభిన్నమైన ప్రచార వ్యూహాన్ని ప్లాన్ చేసారు. ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో సినిమాను ప్రమోట్ చేశారు. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) వేదికగా తారక్.. రాం చరణ్ దర్శకుడు రాజమౌళితో కలిసి ఓ ప్రమోషన్ చేసారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ తారక్ తన దైన శైలిలో అమ్మ తోడు అంటూ ఎంట్రీ ఇవ్వగా... ఈ ఆట నాదే- ఈ వేట నాదే అంటూ రాం చరణ్ జత కలిసారు.

ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ కోసం

ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ కోసం

ఇక, ఇద్దరి మధ్య దర్శకుడు రాజమౌళి చేరి తాను స్టార్ట్ చెప్పకుండానే మొదలు పెట్టేసారేంటంటూ మరింత ఆసక్తి పెంచారు. ఐపీఎల్‌ తర్వాత భారీ ఆదరణతో దూసుకెళ్తున్న పీకేఎల్‌ ఎనిమిదో సీజన్‌ను బుధవారం 'ఆర్‌ఆర్‌ఆర్‌' హీరోలు, దర్శకుడు స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీకేఎల్ లో ముగ్గురూ కలిసి చేసిన సందడి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇక, ఆర్ఆర్ఆర్ లో భీమ్, అల్లూరి సీతారామ రాజుల పాత్రలో ఒదిగిన ఈ ఇద్దరు హీరోలు నాటు సాంగ్ స్టెప్పులతో అభిమానుల్లో అంచనాలు పెంచేసారు.

భారీగా పెరుగుతున్న అంచనాలు

భారీగా పెరుగుతున్న అంచనాలు

అదే విధంగా సినిమా లో ప్రతీ అంశంలోనూ ప్రత్యేకత ఉందనేది ఇప్పటికే విడుదల అయిన ట్రియలర్స్ స్పష్టం చేస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంతో సిద్దమైన ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం తాజాగా తెలుగు ఎడిటర్స్ గిల్డ్ సైతం ఇతర సినిమాల విడుదల వాయిదా కోసం మంతనాలు చేసింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ వాయిదా పడింది. ఇక, ఈ పాన్ ఇండియా మూవీ ఏ రకమైన హిట్ సాధిస్తుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+