Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్‌బీఐలో భారీ స్కామ్:కోట్ల సొమ్ము దారి మళ్లింపు;డిప్యూటీ మేనేజర్ సహా 30 మందిపై వేటుకు రంగం సిద్ధం

మచిలీపట్నం:కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్‌బీఐలో ఇటీవల వెలుగు చూసిన భారీ కుంభకోణానికి సంబంధించి బ్యాంకు సిబ్బందిపై వేటుకు రంగం సిద్దమయింది.

ఖాతాదారులకు సంబంధించిన కోట్లాది రూపాయల సొమ్మును డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసిన వంశీ కృష్ణమూర్తి తన బంధువుల,స్నేహితుల అకౌంట్లకు దారి మళ్లించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించగా దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు స్వాహా అయినట్లు తేలింది. దీంతో ఈ స్కామ్ తో సంబంధం ఉన్న డిప్యూటీ మేనేజర్ తో సహా 30 మంది బ్యాంకు సిబ్బంది సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.

Rs 3.50 Cr Scam in Machilipatnam SBI Main Branch:Action on 30 bank people including deputy manager

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెయిన్ బ్రాంచ్ లో సుమారు 5 నెలల క్రితం భారీ కుంభకోణం బయటపడింది. బ్యాంకులోని ఖాతాల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా చూడాల్సిన డిప్యూటీ మేనేజర్ వంశీ కృష్ణమూర్తి రూ.3.50 కోట్ల సొమ్మును పార్కింగ్‌ అకౌంట్‌లో ఉంచి తనకు తెలిసిన వారికి బదిలీ చేశాడని తెలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...లైబ్రరీ సెస్సుకు సంబంధించిన అకౌంట్లలో చెక్కుల జమల విషయమై తేడాలు రావడంతో, వారి నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో చీఫ్‌ మేనేజర్‌ ఐ.వి.ఎస్.వి.శర్మ ఈ కుంభకోణాన్ని గుర్తించారు. మొత్తం రూ.మూడున్నర కోట్లకు పైగా సొమ్ము దారి మళ్లగా డిప్యూటీ మేనేజర్ వంశీకృష్ణమూర్తి దీనికి బాధ్యుడని...రూ.2 కోట్లను అతడు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బంధువులు, స్నేహితుల ఖాతాలకు మళ్లించినట్లు కనుగొన్నారు. మిగిలిన సొమ్ము విషయమై కూడా వివరాలు రాబట్టినట్లు తెలిసింది.

శివపార్వతి అనే మహిళ అకౌంట్‌కు రూ.68.04 లక్షలు, తేజసుమకు రూ.22.25 లక్షలు, రవికాంత్‌కు రూ.31.70 లక్షలు, రవికాంత్‌కు చెందిన మరో అకౌంట్‌కు రూ.5.74 లక్షలు, రాధికా కరుణకు చెందిన రెండు అకౌంట్లకు రూ.24.71 లక్షలు, రూ.18.35 లక్షలు చొప్పున, అంజనీదేవి అకౌంట్‌కు రూ.6.53 లక్షలు, నాగవేణి అకౌంట్‌కు రూ.6.14 లక్షలు, శ్రీనివాసరావు అకౌంట్‌కు రూ.16.43 లక్షలు బదిలీ చేశాడు.

ఈ స్కామ్ విషయమై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు అందడంతో డీఎస్పీ ధర్మేంద్ర కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వంశీని పోలీసులు విచారించగా అతడు గతంలో పనిచేసిన ప్రదేశాల్లోనూ ఇలాగే చేతివాటం ప్రదర్శించినట్లు...ఆ క్రమంలో ఒకసారి సస్పెండ్‌ కూడా అయినట్లు తెలిసింది. కాగా, సకాలంలో ఈ స్కామ్‌ను గుర్తించని కారణంగా చీఫ్‌ మేనేజరు శర్మను ఆర్‌ఎం ఆఫీసుకు బదిలీ చేయగా తాజాగా ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ పూర్తి చేసి ఆమేరకు దీనితో సంబంధం ఉన్న డిప్యూటీ మేనేజర్ వంశీ కృష్ణమూర్తితో సహా మొత్తం 30 మంది బ్యాంకు సిబ్బందిపై వేటు వేయనున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకింగ్ రంగంలో ఈ స్కామ్ చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+