వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా మంత్రికి వడ్డాణం ఇచ్చారా, బాబు సీరియస్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రానైట్ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా మంత్రికి లక్షల విలువ చేసే వడ్డాణం ఇచ్చారనే ప్రచారం కలకలం రేపుతోంది. ఇది ఇప్పుడు సచివాలయంలోను హాట్ టాపిక్ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదరు మహిళా మంత్రిని వివరణ అడిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలె ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వారు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకంగా ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. అయితే, ఈ ఆరోపణలను పీతల సుజాత ఖండించారు.

తాను ఎవరి దగ్గరా బహుమతులు తీసుకోలేదన్నారు. అసలు వడ్డాణం గురించి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదంతా తన పైన సాగుతున్న దుష్ప్రచారమని సుజాత అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను ఎలాంటి వివరణ కోరలేదని చెప్పారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని, కానీ బహుమతులు ఇవ్వలేదన్నారు.

Rs.37 Lakh gold belt gift draws CM Chandrababu’s ire

ఫోటోలు తీసి పంపించారా?

సుజాతకు బహుమతులు ఇచ్చారని, వాటిని అక్కడే కొందరు తెరిచారని, అందులో అద్భుతమైన బహుమతి కనిపించిందని, దీనిని కొందరు టీడీపీ వర్కర్స్ ఫోటోలు తీసి చంద్రబాబుకు, నారా లోకేష్‌కు పంపించారని, ఇది తెలిసి బాబును వారిపై అసహనం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిని సుజాత మాత్రం ఖండిస్తున్నారు.

రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌పై రైతుల్లో అవగాహన కల్పించాలి: శివాజీ

సీమాంధ్ర రాజధాని భూముల సేకరణపై ప్రభుత్వం అనుసరించే విధానాలను రైతులకు తెలియజేయాలని మాజీఎంపీ, రైతు నాయకుడు యలమంచలి శివాజీ సూచించారు. 1975లో ఏర్పడిన ఉడాను రద్దు చేశాక దాని స్థానంలో ఏర్పాటుచేసిన సంస్థకు చట్టబద్ధత కల్పించాలన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుళ్లూరు, మంగళగిరి, అమరావతి, తాడికొండ తదితర ప్రాంతాల్లో రాజధానిని ప్రతిపాదించారు.

ఈ ప్రాంతం వారిని పరిగణనలోకి తీసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న భవనాలను తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకోవాలన్నారు. అమరావతి సమీపంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్న 150 ఎకరాల్లోకి నాగార్జున యూనివర్సిటీని తరలించి, ప్రస్తుతం యూనివర్సిటీ ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.

English summary

 Hyderabad: The alleged over enthusiasm of Andhra Pradesh mining minister Peethala Sujatha has landed her and her Cabinet colleague Siddha Raghava Rao in trouble with AP Chief Minister Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X