రూ. 45 లక్షలతో పట్టుబడిన పార్థసారథి సతీమణి

కమలతో పాటు ఆమె వెంట ప్రయాణిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై కమలను పోలీసులు విడుదల చేశారు. పార్థసారథి మచిలీపట్నం లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన పార్థసారథి ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించారు. కానీ, ఆయన వైయస్ జగన్ వైపు వచ్చారు.
ఇదిలావుంటే, విజయవాడ పాతబస్తీ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న పది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications