అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్ మోసం: 5.80 లక్షలు కాజేశాడు, ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన స్నేహితుడు 5.80 లక్షల రూపాయలను కాజేసిన ఘటన బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసానికి గురైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామ చర్చి పాస్టర్‌ మోసెస్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. మోసెస్‌కు 2013 అక్టోబర్‌ 7న నైజీరియాకు చెందిన జాషువా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు.

మోసెస్‌ చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నాడని, నిడిగల్లులో సరైన ప్రార్థనామందిరం లేదని తెలుసుకున్న జాషువా, తనకు విదేశాల నుంచి చర్చిలు కట్టించే సంస్థతో పరిచయాలున్నాయని, వారు చర్చిల నిర్మాణానికి నిధులు ఇస్తారని మోసెస్‌ను నమ్మించాడు. 5.4 మిలియన్‌ డాలర్ల డబ్బు తమ వద్ద ఉందని, అందులో 20 శాతం చర్చికి ఇస్తామని తెలిపాడు. భారత రిజర్వు బ్యాంకులో నెట్‌బ్యాంకింగ్‌ ఖాతా తెరవడానికి యాంటీ టెర్రరిస్ట్‌ క్లియరన్స్‌ సర్టిఫికెట్‌, కాట్‌కోడ్‌ తదితర ఖర్చుల పేరుతో రూ.5,80,700 పలు దఫాలుగా పలు ఖాతాలకు మోసెస్‌ ద్వారా బదిలీ చేయించుకున్నాడు.

 Rs. 5.80 lacs facebook fraud

చివరికి 2014 సెప్టెంబర్‌ 16న ఫోన్‌ చేసి ఢిల్లీకి చెందిన తన స్నేహితుడు జార్జ్‌ యాకోబ్‌ నీ కోసం ఎదురుచూస్తున్నాడని, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ కోసం రూ.5.45 లక్షలు చెల్లిస్తే డబ్బులు వెంటనే తిరిగి వస్తాయని జాషువా చెప్పడంతో అతడిపై అనుమానం వచ్చిన మోసెస్‌ ఇంతవరకు తాను డబ్బు చెల్లించిన ఖాతాలు సరైనవేనా అని ఆర్‌బీఐని సంప్రదించాడు.

ఇవన్నీ నకిలీవని ఆర్‌బీఐ తేల్చేసింది. దీంతో మోసెస్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను చర్చి సభ్యుల వద్ద నుంచి చందాలు వసూలు చేసి వారికి డబ్బు చెల్లించానని, ఈ మొత్తాన్ని రికవరీ చేయించాలని పోలీసులను కోరాడు.

స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: జిల్లా వెంకటగిరి అటవీశాఖ కార్యాలయంలో గురువారం తమిళనాడుకు చెందిన రాజన్ రాజేష్ (25) అనే స్మగ్లర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాజులమిట్ట వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న తమిళనాడుకు చెందిన రాజన్ రాజేష్, ఢిల్లీ దినేష్ అనే ఇద్దరు స్మగ్లర్లను గురువారం రాత్రి 11గంటల సమయంలో అటవీశాఖ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు రేంజర్ శివకుమార్‌రెడ్డి తెలిపారు.

ఆ సమయంలో విచారణ జరపడం బాగుండదని, ఉదయం విచారణ చేసేందుకు ఆఫీస్ గదిలో వారిద్దరిని ఉంచారు. దినేష్ నిద్రపోతున్న సమయంలో తెల్లవారుఝామున ఒంటి గంట సమయంలో రాజేష్ ఆఫీస్ గదిలో ఉన్న సిసి కెమెరా వైర్లను కత్తిరించి ఆ వైర్లతో ఆ గదిలో ఉన్న టేబుల్ సహాయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు.

English summary
Rs. 5.80 lacs facebook fraud, victim complained on accused in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X