‘నారాయణ’కు రూ.50 లక్షల జరిమానా, అందులో కొంత శ్రీహర్ష కుటుంబానికి: మంత్రి గంటా
అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
బుధవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తిరుపతిలోని నారాయణ జూనియర్ కాలేజీలో బి.కొత్తకోటకు చెందిన శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ఆ కాలేజీకి రూ.50 లక్షల జరిమానా విధించామని, అది చెల్లించకపోతే కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా హెచ్చరించారు. ఈ సొమ్ములో కొంత భాగాన్ని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి చెల్లించే అంశం పరిశీలిస్తామని చెప్పారు.
విద్యార్థుల చదువుకు, ఆటలకు కాలేజీలు కేటాయించే సమయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానం అమలవుతుందని మంత్రి ప్రకటించారు.












Click it and Unblock the Notifications