వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పటి దాకా తగ్గం: ఏపీ, తెలంగాణల్లో ఆర్టీసీ బంద్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమ్మెకు దిగాయి. బస్సులు బంద్ కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయివేటు వాహనాల వల్ల అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.

తమకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై యాజమాన్యం నుండి స్పష్టమైన హామీ రానందున సమ్మె బాట పట్టాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమ్మె విరమింప చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, సఫలం కాలేదు.

27 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించినా.. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్మెంట్ కోరుతున్నాయి. తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని చెప్పాయి. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కమిటీలు వేశామని, వాటి నుండి నివేదిక వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రెండు రాష్ట్రాల్లో ఇరవై వేలకు పైగా బస్సులు నిలిచాయి.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె మొదలైంది. సమ్మె నివారణకు ఉభయ ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

చివరి నిమిషందాకా అనేక స్థాయుల్లో జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా తమకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌తో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) సమ్మె నోటీసు ఇచ్చాయి.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

దీనిపై మంగళవారం కార్మిక సంఘాల నేతలతో ఏపీ, తెలంగాణ రవాణా మంత్రులు శిద్దా రాఘవ రావు, మహేందర్‌ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సాంబశివ రావు వేర్వేరుగా చర్చలు జరిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని, 27 శాతం ఇస్తామని యాజమాన్యం తెలిపింది.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

ఈ అంశంపై ఇరు ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమిటీ నివేదిక కూడా అందాలని, ఈ క్రమంలో సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరింది. ఇందుకు, కార్మిక సంఘాలు అంగీకరించలేదు.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టిన నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులను యధాతధంగా నడిపేందుకు ప్రయత్నిస్తోంది.

ఆర్టీసీ బంద్

ఆర్టీసీ బంద్

తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున భత్యం ఇవ్వాలని నిర్ణయించింది. వీరికి రెగ్యులర్‌ నియామకాల్లో 5శాతం వెయిటేజీ ఇస్తామని ఆర్టీసీ ప్రకటించింది.

టీ మంత్రి మహేందర్ రెడ్డితో చర్చలు

టీ మంత్రి మహేందర్ రెడ్డితో చర్చలు

ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.దీంతో తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుఝాము నుంచి ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.

టీ మంత్రి మహేందర్ రెడ్డితో చర్చల అనంతరం

టీ మంత్రి మహేందర్ రెడ్డితో చర్చల అనంతరం

ఈ సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మద్దతు పలుకుతున్నాయి.

ఏపీ మంత్రి శిద్ధా రాఘవ రావుతో చర్చలు

ఏపీ మంత్రి శిద్ధా రాఘవ రావుతో చర్చలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. జిల్లాలోని 14 డిపోల్లో 1400 సర్వీసులు నిలిచిపోయాయి.

చర్చల అనంతరం

చర్చల అనంతరం

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగించ కూడదని సమ్మె నుంచి తిరుమలకు మినహాయింపు ఇచ్చారు. అయినా, తిరుమలకూ నామమాత్రంగానే బస్సులు తిరుగుతున్నాయి.

English summary
RTC Strike from Today; Over 20,000 Buses to Go Off Roads
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X