అమరావతి స్పెషల్: బస్సు ప్రయాణికుల కోసం సీటుకో టీవీ, రిమోట్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో ప్రయోగాత్మక సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ టీవీ ఏర్పాటు చేసి.. దానిలో సినిమాలు వేస్తుండటం సర్వసాధారణమే.
కాగా, ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఏపీఎస్సార్టీసీ మాత్రం మరో ముందడుగు వేస్తూ బస్సులో సీటుకో టీవీ.. ఇష్టమైన ఛానెల్ చూసేందుకు రిమోట్ సౌకర్యం కల్పించాలని భావించింది.

అంతేకాదు, ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీఎస్ ఆర్టీసీ. ఆర్టీసీలో అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి ప్రయాణికులకు నచ్చిన ఛానెల్ చూసేందుకు రిమోట్ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. అయితే, టికెట్ ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications