హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యా.. మా గోడు బాబుకు చెప్పయ్యా, ఎంజీబీఎస్‌లో క్రికెట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'బాలయ్యా.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను మీ బావకు నీవైనా చెప్పయ్యా' అంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో ఆర్టీసీ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి వినతిపత్రం అంటించారు. ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇద్దామని వెళ్లిన కార్మికులు ఆయన ఇంటివద్ద ఎవ్వరూ లేకపోవడంతో వినతి పత్రాన్ని గోడకు అంటించారు.

మా ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన ఓ బాలయ్యా.. ఎక్కడున్నావయ్యా మా ఆర్టీసి కార్మికుల గోడు వినవయ్యా, త్వరగా ఇటు రావయ్యా మీ రైనా మీ బావకు చెప్పి సమస్యలు పరిష్కరింపవయ్యా అంటూ హిందూపురం డిపో కార్మికులు అందులో పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిట్మెంట్ కోసం స్ట్రైక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె ప్రాథమికంగా చట్ట విరుద్దమని, వెంటనే విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. ఆ నోటీసు తమకు అందలేదని కార్మికులు చెబుతున్నారు. తదుపరి విచారణ కోర్టులో 12వ తేదీన జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ విషయమై కోర్టు వైపు చూస్తున్నాయి.

బాలకృష్ణ

బాలకృష్ణ

'బాలయ్యా.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను మీ బావకు నీవైనా చెప్పయ్యా' అంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో ఆర్టీసీ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి వినతిపత్రం అంటించారు.

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

రాష్ట్రాల్లో సమ్మెపై నిషేధం ఉందని, ఈ సమయంలో సమ్మె చేయడం అత్యవసర సేవలకు భంగం కలిగించినట్లేనని, తక్షణం విధుల్లో చేరాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆర్టీసీ కార్మికులను ఆదేశించింది.

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ కార్మికులు నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెను సవాల్‌ చేస్తూ టీడీపీ నేత సీఎల్‌ వెంకట్రావ్‌, మహ్మద్‌ గౌస్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్లపై జస్టిస్‌ కేసీ భాను నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ శనివారం విచారణ చేపట్టింది.

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు, విద్యార్థులే గాక రోగులు సైతం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్‌ కోర్టుకు నివేదించారు.

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

నిషేధం ఉండగా సమ్మె చేయడం అత్యవసర సేవలకు భంగం కలిగించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. కార్మికులంతా తక్షణం విధుల్లో చేరాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

 ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే కార్మిక సంఘాలు మాత్రం సమ్మెను కొనసాగించేందుకే మొగ్గుచూపాయి.

 ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఈ మేరకు ఎంప్లాయీస్‌, టీఎంయూ, ఎన్‌ఎంయూ నేతలు వేర్వేరుగా ప్రకటన చేశారు. హైకోర్టు తీర్పుపై పిటిషనర్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ తమ వాదనలు విన్న న్యాయస్థానం ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించిందన్నారు.

 ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

కార్మికుల డిమాండ్లపై వాదనలు వినేందుకు న్యాయస్థానంసమయం ఇచ్చిందన్నారు. వారి డిమాండ్లు న్యాయమైనవా? కాదా? అనే విషయాలు తదుపరి విచారణలో హైకోర్టు పరిశీలిస్తుందని చెప్పారు.

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరిపారు.

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసి స్ట్రైక్ నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండుల్లో వర్కర్లు క్రికెట్ ఆడుకుంటూ గడిపారు.

 ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

ఆర్టీసీ స్ట్రైక్ ఇక్కట్లు

రాష్ట్రాల్లో సమ్మెపై నిషేధం ఉందని, ఈ సమయంలో సమ్మె చేయడం అత్యవసర సేవలకు భంగం కలిగించినట్లేనని, తక్షణం విధుల్లో చేరాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆర్టీసీ కార్మికులను ఆదేశించింది.

English summary
RTC workers appeals MLA Balakrishna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X