ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై కిరణ్‌కు హైకోర్టు షాక్

గవర్నర్ నరసింహన్ తొలుత ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల నియామకంపై పునరాలోచన చేయాలని, వారి స్థానంలో ఆరు వారాల్లోగా కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గవర్నర్ ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిలను తొలగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంధ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు నలుగురి నియామకంపై పునఃసమీక్షించి, కొత్త వారిని నియమించాలని ఆదేశించింది.
కాగా, ఎనిమిది మందిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్‌కు ఫైల్ పంపగా, అందులో నలుగురికి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఆ నలుగురి ఫైలును ప్రభుత్వం మరోసారి పంపించి గవర్నర్‌చే ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో స్వచ్ఛంధ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అప్పుడు విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్‌లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల ఫైలును కిరణ్ ప్రభుత్వం రెండోసారి పంపించి ఆమోద ముద్ర వేయించుకుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications