Russia-Ukraine War:ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. విదేశాంగ శాఖకు ఫోన్‌లు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. యుద్ద విమానాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భయానక వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరుల్ని తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దీంతో వేలాది మంది భారతీయు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. సుమారు 400 మందికి పైగా తెలుగువారు ఉన్నట్లు సమాచారం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులు బిక్కుమంటూ గడుపుతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని అభ్యర్థిస్తున్నారు.

విదేశాంగ శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరాయి. ఈ మేరకు సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ అధికారులను విద్యార్థులు సంప్రదించాలని సూచించారు. ఎప్పటికప్పుడు విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి.

విద్యార్థుల వివరాలు సేకరణ
ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను ఎప్పటికప్పుడు.. సంప్రదింపులు జరుపుతున్నామని, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని తాము కూడా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల చిరునామాలను సేకరిస్తున్నారు.
దాదాపు 350 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అటు తెలంగాణ ఎన్నారై సెల్ కూడా అధికారులకు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు. విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Recommended Video

గగనతలాన్ని యూసేసిన ఉక్రెయిన్
భారత్ నుంచి ఉక్రెయిన్‌కు ఎయిర్ ఇండియా మాత్రమే విమానాలు నడుపుతోంది. అయితే అక్కడ యుద్ధం వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఢిల్లీ నుంచి అక్కడకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం భారత్‌కు ఖాళీగానే తిరుగు ముఖం పట్టింది. ఈ నెల 26 న భారత్ నుంచి మరో ప్రత్యేక విమానం వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం అక్కడ యుద్థం కొనసాగుతున్న నేపథ్యంలో అది వెళ్తుందా? లేదా అన్నా దానిపై సందేహాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications