ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: జగన్‌పై సబ్బం మళ్లీ, టి పైనా

 Sabbam slams YS Jagan again
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి సోమవారం మరోసారి ధ్వజమెత్తారు. తన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మీ రాజకీయం కోసం మీరేమైనా చేసుకోండని కానీ, నిజమైన సమైక్యవాదులను దొంగలు అనడం మాత్రం సరికాదన్నారు.

సిగ్గు గురించి జగన్ మాట్లాడటం చూస్తే సిగ్గుకే సిగ్గేస్తుందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీలో ఎవరికెంత గౌరవం ఉందో ఆ పార్టీలో ఉన్న వారందరికీ తెలుసునన్నారు. ఎవరెవరికి ఎంత గౌరవం ఉంటుందో జగన్ సోదరి షర్మిలకు కూడా తెలుసునని చెప్పారు. జగన్ లోపల విభజనవాది.. బయట సమైక్యవాది అని ఆరోపించారు. ప్లీనరీలో జగన్ భాష ఆయన స్థాయికి తగినట్లుగా లేదన్నారు.

జగన్ పార్టీ నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదన్నారు. 'వాళ్లు దొంగలు.. వీళ్లు దొంగలు' అంటే ఊరుకునేది లేదన్నారు. ఆ పార్టీ నేతలకు ఉన్న సంస్కారం తనకు అంటగంటవద్దన్నారు.

కాగా, పార్లమెంటులో 95 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే అమోదం పొందుతున్నాయని, తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలోను అదే జరిగిందన్నారు. అసెంబ్లీ మూజువాణి ఓటుతో బిల్లును వ్యతిరేకించిందన్నారు. డివిజన్ కోరకపోవడం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడమే అన్నారు. తమ ప్రయత్నాల వల్లనే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాలేదన్నారు. విభజన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు.

భారతీయజ జనతా పార్టీ తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతిచ్చే అంశంపై తర్జన భర్జన పడుతోందన్నారు. బిజెపి నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నాది మూడు నాలుగు నెలల క్రితం మాట్లాడితే బాగుండేదన్నారు. ఉత్తర భారత దేశంలో నరేంద్ర మోడీ హవా కనిపిస్తోందని, ఎన్నికల వరకు ఏస్థాయిలో ఇది నిలబడుతుందనేది చూడాల్సి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+