తెరాసలోకి కుమారుడితో సహా సబితా ఇంద్రారెడ్డి?
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రిగా పనిచేసిన తెలంగాణ మహిళా సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులోభాగంగానే ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆమెతో పాటు ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు డుమ్మా కొట్టారని అంటున్నారు.
వీరిద్దరితో పాటు పలువురు జిల్లా నేతలు కూడా సదస్సుకు గైర్హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ఆమె వర్గంగా పేరొందిన పలువురు నాయకులు సదస్సుకు డుమ్మా కొట్టారు.

పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ఇటీవలి జరిగిన పలు సమావేశాల్లో సబితా ఇంద్రారెడ్డి చెప్పినప్పటికీ తాజా సదస్సుకు దూరంగా ఉండటంపై అక్కడి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
సబితా ఇంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నారు. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిపై ఓటమి పాలయ్యారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications