నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సందడే సందడి: పీఆర్ కండ్రిగకు సచిన్, భారీ బందోబస్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: రాజ్యసభ సభ్యులు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆదివారం ఉదయం తాను దత్తత తీసుకున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. ఆయన పైలాన్‌ను ఆవిష్కరించారు. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఆయన గ్రామంలో పర్యటించనున్నారు. సచిన్ రాక నేపథ్యంలో గ్రామంలో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద ఉన్న కృష్ణపట్నం పోర్టును శనివారం సచిన్‌ సందర్శించిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోర్టుకు చేరుకున్న ఆయనకు పోర్టు యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. పోర్టు భద్రతా సిబ్బంది నుంచి సచిన్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోర్టు చేపట్టిన కోటి మొక్కల ఉద్యమంలో భాగంగా పోర్టు ఆవరణలో సచిన్‌ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల జీవనవిధానాన్ని మెరుగు పరిచేలా సీవీఆర్‌ ఫౌండేషన్‌ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముంబైలో తనకు వైద్యమందించే డాక్టర్‌ సందేష్‌ మయేకర్‌ కృష్ణపట్నం పోర్టులో కార్పొరేట్‌ తరహా దంత వైద్యశాల నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. సీవీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పేదలకు విద్య, వైద్య సేవలు అందించడం చూస్తుంటే ఆ సంస్థ సామాజిక బాధ్యతను ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందో అర్థమవుతుందన్నారు.

చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచిన్‌ పోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వెంట పోర్టు ఎండీ శశిధర్‌ ఉన్నారు. పోర్టు సీఈవో అనిల్‌ ఎండ్లూరి, జేసీ రేఖారాణి, పోర్టు సిబ్బంది సచిన్‌కు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు హెలికాప్టర్‌ ద్వారా 15 నిమిషాల పాటు పోర్టును ఏరియల్‌ వ్యూలో సచిన్‌ వీక్షించారు.

సచిన్

సచిన్

అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టు దేశాభివృద్ధిలో కీలకంగా మారిందని క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు.

సచిన్

సచిన్

చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచిన్‌ పోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వెంట పోర్టు ఎండీ చింతా శశిధర్‌ ఉన్నారు.

సచిన్

సచిన్

పోర్టు సీఈవో అనిల్‌ ఎండ్లూరి, జేసీ రేఖారాణి, పోర్టు సిబ్బంది సచిన్‌కు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు హెలికాప్టర్‌ ద్వారా 15 నిమిషాల పాటు పోర్టును ఏరియల్‌ వ్యూలో సచిన్‌ వీక్షించారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

అనంతరం సీవీఆర్‌ ఫౌండేషన్‌ ఆంగ్ల మీడియం పాఠశాల విద్యార్థులను పలకరించి వారితో కరచాలనం చేశారు. సాయంత్రం పోర్టు యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోట్‌లో సముద్ర విహారం చేశారు. చివరగా పోర్టు అతిథి గృహానికి చేరుకుని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. శనివారం రాత్రి పోర్టు అతిథిగృహంలోనే సచిన్‌ బస చేయనున్నారు.

అనంతరం సీవీఆర్‌ ఫౌండేషన్‌ ఆంగ్ల మీడియం పాఠశాల విద్యార్థులను పలకరించి వారితో కరచాలనం చేశారు. సాయంత్రం పోర్టు యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోట్‌లో సముద్ర విహారం చేశారు. చివరగా పోర్టు అతిథి గృహానికి చేరుకుని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. శనివారం రాత్రి పోర్టు అతిథిగృహంలోనే సచిన్‌ బస చేయనున్నారు.

English summary
Master Blaster Sachin Tendulkar reaches PR Kandriga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X