వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ్వుతూనే ముంచారు: సోనియాపై సాయి ప్రతాప్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sai Pratap
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని డిమాండ్ చేసే దుస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని రాయలసీమకు చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమంటు సభ్యుడు సాయిప్రతాప్ అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవ్వుతూనే కొంపముంచుతారని భావించలేదని అన్నారు.

అందరికీ చెప్పే నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీ అంటున్నారని, అయితే ఇది పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకుంటున్నామని అసలెవరికి చెప్పారో కూడా తెలియదన్నారు. తాము చివరి వరకూ సమైక్యాంధ్ర డిమాండ్‌నే వినిపించామని చెప్పారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసి మరీ చెబుతానని.. తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ బిల్లు ఆమోదం పొందబోదని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. శిక్షపడ్డ ప్రజాప్రతినిధులను కాపాడేందుకు కేబినెట్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించి పారేయాలని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు.. ఎనిమిది కోట్ల మంది ఐక్యతను కాపాడేందుకు తెలంగాణ పై కేబినెట్ నోట్‌ను ఎందుకు చించే యకూడదని సాయిప్రతాప్ ప్రశ్నించారు.

35 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న కాంగ్రెస్‌వాదిగా తాను కేబినెట్ నోట్‌ను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని రాహుల్ వ్యతిరేకించారని ఆయన అన్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు తెలంగాణపై నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

English summary
Congress MP Sai Pratap lashed out at Sonia Gandhi on bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X