వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ స్కీలంను విమర్శించండి కానీ: చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగులు హెచ్చరికలా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని ఓ వర్గం మీడియాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

జగన్ పథకాలను విమర్శించండి కానీ..: సజ్జల

జగన్ పథకాలను విమర్శించండి కానీ..: సజ్జల


చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారని ఆ మీడియా వర్గాలపై మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ విమర్శించండి తప్పులేదు... కానీ, ఆధారాలుండాలన్నారు. పేదలు సొంత కాళ్ళ మీద నిలబడకూడదు అనేదే చంద్రబాబు ఆలోచన అని ఆయన మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఉంటే చంద్రబాబే ఉండాలా?: సజ్జల ఫైర్

ఉంటే చంద్రబాబే ఉండాలా?: సజ్జల ఫైర్

ఉంటే చంద్రబాబు ఉండాలి... లేదంటే రాష్ట్రం నాశనం కావాలి అనేది ఆ పత్రికల భావన. ప్రజలు వీళ్ళని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం ఉంది. అవి ప్రచార సాధనాలు కాదు... విష ప్రచార సాధనాలు. వాళ్ళు చేసిన అడ్డగోలు దోపిడీకి దాడులు చేస్తే ఇందులో కక్షపూరితం ఎక్కడుంది. వైజాగ్ స్టీల్ కేంద్ర ప్రభుత్వానిది... మనకు దానితో చరిత్రాత్మక బంధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇచ్చింది అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Recommended Video

History of Air Crashes in India
హెచ్చరికలు ఉద్యోగులకు మంచిది కాదు: సజ్జల రామకృష్ణారెడ్డి

హెచ్చరికలు ఉద్యోగులకు మంచిది కాదు: సజ్జల రామకృష్ణారెడ్డి

మరోవైపు, పీఆర్సీ కోసం ఆందోళనబాటపడుతున్న ఉద్యోగ సంఘాల అంశంపైనా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీల అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. సీపీఎస్ రద్దుపై కమిటీలు వేశామని, అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు. నెల రోజుల్లో ఈ అధ్యయనం పూర్తవుతుందని చెప్పారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం సరైంది కాదని, ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగుల పట్ల బాధ్యత కంటే ఉద్యోగులకు నష్టం కలిగిస్తాయన్నారు. వారు సంయమనం పాటించాలన్నారు. హెచ్చరికలు చేయడం వల్ల తాము వెనక్కి తగ్గమని, అదే సమయంలో ముందుకూ వెళ్లమని అన్నారు. ఇలాంటి హెచ్చరికలతో వారికే నష్టమన్నారు. వారంలోపే పీఆర్సీ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

English summary
Sajjala Ramakrishna Reddy fires at chandrababu and responded govt employees warnings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X