అది చూసే జగన్ కు బ్రేకులు ? సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ దీటుగా ఎదుర్కొంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ సంస్ధాగతంగా ఇంకా బలపడాలని, పార్టీ నెట్‌వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్ధాయి వరకు వెళ్ళాలని ఆయన ఇవాళ పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో సూచించారు. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారని, అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలమన్నారు. అలాగే వైసీపీపై అదేపనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను థీటుగా ఎదుర్కోగలగుతామన్నారు.
జగన్ కు ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారన్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారని, పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్ధాగతంగా పట్టిష్టం చేయడం ప్రధాన కర్తవ్యమని, పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే అని వైసీపీ నాయకులకు తెలిపారు. తమ నాయకుడు జగన్ శక్తి కూడా కార్యకర్తలే అన్నారు. పార్టీ తన ప్రస్ధానంలో అనేక రికార్డులు సృష్టించిందని, జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళారన్నారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారన్నారు. సంక్షేమానికి నిజమైన అర్ధం చెప్పిన పాలన తమదన్నారు. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని సజ్జల తెలిపారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగిందన్నారు. తమ పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడిందని, ఇక ముందు కూడా అలాగే ఉంటుందన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా తమ వెంటే ఉండేలా కృషి చేయాలని మైనార్టీ నేతల్ని కోరారు. వైయస్సార్‌సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలని వారికి సూచించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications