ఎన్టీఆర్ ప్రజాబలంతో ఎదిగితే చంద్రబాబు కుట్రలతో ఎదిగాడు; అందుకే అవసాన దశలో టీడీపీ: సజ్జల

తెలుగుదేశం పార్టీ 40ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ఉన్న టిడిపి వేరని, ఇప్పుడు ఉన్న టిడిపి వేరని వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కుట్రలతో ఏవిధంగా అధికారంలోకి రావాలన్నది ప్రస్తుత టిడిపి పాలసీ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

టీడీపీకి 40 ఏళ్ళ సంబరాలు కాదు, 27ఏళ్ల సంబరమే: సజ్జల

టీడీపీకి 40 ఏళ్ళ సంబరాలు కాదు, 27ఏళ్ల సంబరమే: సజ్జల

మంగళవారం తాడేపల్లి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ పుట్టి 40 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకుంటున్నారని ఇలా సంబరాలు చేసుకోవడంలో తప్పు లేదని పేర్కొన్నారు. అయితే 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించడం కూడా చూడవలసిన కోణం అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. టీడీపీకి 40 ఏళ్ళ సంబరాలు కాదు, 27ఏళ్ల సంబరమేనంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రజా అభిమానంతో అధికారంలోకి వస్తే, చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ తో అధికారంలోకి వచ్చారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదని ప్రజల పేర్కొన్నారు.

తెలుగు దేశం పార్టీ అవసాన దశలో ఉంది: సజ్జల

తెలుగు దేశం పార్టీ అవసాన దశలో ఉంది: సజ్జల

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అవసాన దశలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్న సజ్జల, ఇంతకాలం అలా వ్యవస్థలను మేనేజ్ చేస్తూనే చంద్రబాబు ముందుకు నడిచాడు అంటూ విమర్శించారు. అసెంబ్లీని అడ్డుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని, తెలుగుదేశం పార్టీకి బాకా ఊదడం ఎల్లోమీడియా పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయాన్ని టిడిపి దుర్వినియోగం చేసిందని పేర్కొన్న సజ్జల ప్రజా సమస్యలపై మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాలను ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రశ్నించారు. కావాలని జగన్ పై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

 ఎన్టీఆర్ ప్రజాబలంతో ఎదిగారు.. చంద్రబాబు కుట్రలతో ఎదిగారు

ఎన్టీఆర్ ప్రజాబలంతో ఎదిగారు.. చంద్రబాబు కుట్రలతో ఎదిగారు

ఎన్టీఆర్ ని గద్దె దించడం కోసం చంద్రబాబు కొందరితో కలిసి కుట్ర చేశారని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా బలంతో ఎన్టీఆర్ ఎదిగితే, కుట్రలతో చంద్రబాబు ఎదిగాడు అంటూ విమర్శించారు. ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకంగా ఆనాడు చంద్రబాబు వ్యవహరించారని పేర్కొన్న సజ్జల చంద్రబాబు హయాంలో 27 ఏళ్ల టీడీపీ చరిత్రపై పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకున్న తీరును అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జగన్ ముందు చంద్రబాబు ఎత్తులు పారలేదు

జగన్ ముందు చంద్రబాబు ఎత్తులు పారలేదు

జగన్ పూర్తిగా ప్రజాభిమానంతో ఆవిర్భవించిన నాయకుడని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజల నుండి ఎదిగిన వైఎస్ఆర్, జగన్ ల ముందు చంద్రబాబు ఎత్తుగడలు పారలేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ హయాంలో నేరుగా లబ్ధిదారులకు చేరుకున్నాయని పేర్కొన్న సజ్జల గతంలో ఎన్నడూ ఒక్క నయాపైసా వృధా కాకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందలేదన్నారు. చంద్రబాబు వదిలేసిన అప్పులు ప్రస్తుతం తాము చెల్లించాల్సి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

మీ బతుక్కి ఒక్క గొప్ప పథకం అయినా అమలు చేశారా?

మీ బతుక్కి ఒక్క గొప్ప పథకం అయినా అమలు చేశారా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అందించారని సజ్జల వెల్లడించారు. మీ బతుక్కి గొప్పగా అమలుచేసిన ఒక పథకం ఏదైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. జగన్ పరిపాలనను దేశమంతా ఆసక్తిగా చూస్తుంటే, తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదని, వారికి జగన్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఏపీకి అప్పులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖలు రాశారు

ఏపీకి అప్పులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖలు రాశారు

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా ఏపీ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి వచ్చే ఆదాయాన్ని ఆపాలని కుట్రలు కూడా చేసే స్థాయికి వచ్చారని, ఏపీకి అప్పు ఎలా ఇస్తారంటూ కేంద్రానికి లేఖలు కూడా రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. టిడిపి హయాంలో అప్పులు లేకుండా పాలన సాగించారా అని ప్రశ్నించిన ఆయన తెలంగాణలో అదనంగా ఉన్న స్థలాలు అమ్మితే మాట్లాడలేదంటూ మండిపడ్డారు. కానీ ఏపీ లో మాత్రం గొడవ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఒక పార్టీ ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే టీడీపీని చూడాలి

ఒక పార్టీ ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే టీడీపీని చూడాలి

దిక్కుమాలిన ఆలోచనలు ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంలో వాళ్లే మునిగి పోవడం ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో ఆలోచన చేయనంత గా ఉద్యోగాలు సృష్టించి భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో పోస్టులన్నీ ఖాళీగా పెట్టి మాపై నిందలు వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తాము పారదర్శక పాలన సాగిస్తున్నామని తేల్చి చెప్పారు. ఒక పార్టీ ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే టిడిపిని చూడాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+